రైతులతో చర్చలు జరపాలి

ABN , First Publish Date - 2020-12-02T05:24:12+05:30 IST

కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను వీడి వ్యవసాయ బిల్లులను రద్దు చేయాలని వామపక్షాలు డిమాండ్‌ చేశాయి.

రైతులతో చర్చలు జరపాలి
ధర్నా నిర్వహిస్తున్న వామపక్షనాయకులు

  వామపక్షాల డిమాండ్‌

భానుగుడి(కాకినాడ), డిసెంబరు 1: కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను వీడి వ్యవసాయ బిల్లులను రద్దు చేయాలని వామపక్షాలు డిమాండ్‌ చేశాయి. వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీలో రైతులు చేస్తున్న ఉద్యమానికి మద్దతుగా కాకినాడ కలెక్టరేట్‌ వద్ద  వామపక్షాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. సీపీఎం, సీపీఐ, సీపీఎంఎల్‌ న్యూ డెమోక్రసీ, జనశక్తి నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా బుగతా బంగార్రాజు, తాటిపాక మధు, జె.వెంకటేశ్వర్లు  మాట్లాడుతూ  కేంద్ర ప్రభుత్వానికి రైతుల ఉద్యమం తగిన గుణపాఠం కావాలన్నారు. ఈ వ్యవసాయ బిల్లు రైతులను వారి పొలాల్లోనే పాలేరులుగా మార్చి కార్పొరేట్‌ సంస్థలకు ఊడిగం చేసేలా చేస్తాయని అన్నారు.    రైతులకు కనీస మద్దతు ధర ఇచ్చేందుకు ప్రభుత్వాలు ముందుకు రాకపోగా ఇలా రైతును రోడ్డు పాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు అండగా ఎప్పుడూ ఉంటామని రైతులకు నష్టం జరిగితే చూస్తూ ఊరుకోమన్నారు.  తోకల ప్రసాద్‌, పలివెల వీరబాబు తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2020-12-02T05:24:12+05:30 IST