రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలి

ABN , First Publish Date - 2020-12-20T06:34:05+05:30 IST

ఢిల్లీలో రైతులు చేస్తున్న ఆందోళనకు మద్దతుగా కోనసీమ ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌, క్రీడాకారుల ఆధ్వర్యంలో శనివారం ర్యాలీ నిర్వహించారు.

రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలి
రైతుల ఉద్యమానికి సంఘీభావంగా క్రీడాకారుల ర్యాలీ

అమలాపురం టౌన్‌, డిసెంబరు 19: ఢిల్లీలో రైతులు చేస్తున్న ఆందోళనకు మద్దతుగా కోనసీమ ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌, క్రీడాకారుల ఆధ్వర్యంలో శనివారం ర్యాలీ నిర్వహించారు. సూర్యవాకర్స్‌ క్లబ్‌ ప్రతినిధులు, క్రీడాకారులు స్థానిక హైస్కూల్‌ సెంటర్‌ నుంచి ర్యాలీ నిర్వహించారు. అసోసియేషన్‌ అధ్యక్ష, కార్యదర్శులు చీకురుమిల్లి కిరణ్‌కుమార్‌, కుడుపూడి సూర్యనారాయ ణరావులు మాట్లాడుతూ కేంద్రం తీసుకువచ్చిన మూడు రైతు వ్యతిరేక చట్టా లను రద్దుచేసి రైతులను ఆదుకునే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.  కార్యక్రమంలో క్రీడా ప్రతినిధులు కుడుపూడి త్రినాథ్‌, ఖ్వాజాబాబు, చప్పిడి శోభన్‌బాబు, యనమదల కరుణాకర్‌, ఏవీ రమణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-20T06:34:05+05:30 IST