పొలాల్లో ఇసుక మేటలు

ABN , First Publish Date - 2020-10-28T05:11:47+05:30 IST

ఏలేరు, సుద్దగడ్డ వరదలు రైతులకు అంతులేని నష్టాలను మిగిల్చాయి. గతంలో ఎన్నడూ లేని స్థాయిలో భారీవర్షాలు కురవడం, ఏలేరు నుంచి 38 రోజుల పాటు వరద జలాల విడుదల కొనసాగడంతో పిఠాపురం, గొల్లప్రోలు మండలాల్లో వరి, పత్తి, కాయగూరలు, మిర్చి నాశనమయ్యాయి.

పొలాల్లో ఇసుక మేటలు
గొల్లప్రోలు శివారు పడమటదొడ్డి వద్ద పొలాల్లో వేసిన ఇసుక మేటలు

దయనీయంగా రైతుల పరిస్థితి
పిఠాపురం/గొల్లప్రోలు, అక్టోబరు 27: ఏలేరు, సుద్దగడ్డ వరదలు రైతులకు అంతులేని నష్టాలను మిగిల్చాయి. గతంలో ఎన్నడూ లేని స్థాయిలో భారీవర్షాలు కురవడం, ఏలేరు నుంచి 38 రోజుల పాటు వరద జలాల విడుదల కొనసాగడంతో పిఠాపురం, గొల్లప్రోలు మండలాల్లో వరి, పత్తి, కాయగూరలు, మిర్చి నాశనమయ్యాయి. రోజుల తరబడి నీరు నిలిచిపోవడంతో ఎక్కడికక్కడ వరి పంట కుళ్లిపోయింది. పంటలపై పెట్టిన పెట్టుబడులను రైతులు పూర్తిగా కోల్పోయారు. వరద ఉధృతికి ఏలేరు, పీబీసీ కాలువలకు 30కి పైగా ప్రాంతాల్లో గండ్లు పడ్డాయి. దీంతో సుమారు 150 ఎకరాల్లోని పొలాల్లో ఇసుక మేట వేసింది. గట్లు కోతకు గురై మట్టి పేరుకుపోయింది. ఇప్పుడు వీటిని ఎలా తొలగించాలో తెలియక రైతులు సతమతమవుతున్నారు. వరద నీరు ఇంకా పూర్తిగా తగ్గలేదు. తగ్గితే మరిన్ని ప్రాంతాల్లో మేటలు బయటపడే అవకాశం ఉంది. జరిగిన నష్టాన్ని కళ్లెదుట చూసి రైతులు ఆవేదనకు గురవుతున్నారు.


Updated Date - 2020-10-28T05:11:47+05:30 IST