రైతు భరోసా కేంద్రాలతో పంట విజ్ఞానం

ABN , First Publish Date - 2020-02-08T07:57:02+05:30 IST

జిల్లాలో ఈ నెల 20 నుంచి ప్రారంభించనున్న 310 రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు పంట

రైతు భరోసా కేంద్రాలతో పంట విజ్ఞానం

జేడీ కేఎస్వీ ప్రసాద్‌


సామర్లకోట, ఫిబ్రవరి 7: జిల్లాలో ఈ నెల 20 నుంచి ప్రారంభించనున్న 310 రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు పంట విజ్ఞానం అందించనున్నట్లు జిల్లా వ్యవసాయ సంయుక్త సంచాలకుడు కేఎస్వీ ప్రసాద్‌ తెలిపారు. శుక్రవారం సామర్లకోట వ్యవసాయ పరిశోధనా కేంద్రంలో ఏడీలు, ఏవోలకు నిర్వహిస్తున్న ఎస్‌ఎల్‌టీపీ శిక్షణ తరగతులకు జేడీ ప్రసాద్‌ డీడీ మాధవరావుతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేడీ మాట్లాడుతూ రానున్న ఖరీఫ్‌ నాటికి రైతులకు పూర్తిస్థాయిలో వ్యవసాయ సమాచారం అందించే కేంద్రాలుగా రైతు భరోసా కేంద్రాలు పని చేస్తాయన్నారు. రైతు భరోసా కేంద్రాలకు అనుసంధానంగా ఉండే ఇంటిగ్రేటెడ్‌ లేబొరేటరీల్లో రైతులకు అవసరమగు నీరు, మట్టి నమూనాలు ఎరువులు, పురుగు మందులు విశ్లేషించి నాణ్యత ఉన్న వాటినే రైతుకు అందుబాటులో ఉంచేలా దోహద పడతాయన్నారు.

Updated Date - 2020-02-08T07:57:02+05:30 IST