రైతులను ప్రభుత్వం తక్షణం ఆదుకోవాలి

ABN , First Publish Date - 2020-12-30T06:00:46+05:30 IST

నివర్‌ తుపానుతో నష్ట పోయిన రైతులను తక్షణం ఆదుకోవాలని డిమాండుచేస్తూ మాజీ ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక సబ్‌కలెక్టర్‌ కార్యాలయం వద్ద టీడీపీ నాయకులు ధర్నా నిర్వహించారు.

రైతులను ప్రభుత్వం తక్షణం ఆదుకోవాలి
అమలాపురంలో వినతిపత్రం అందజేస్తున్న మాజీ ఎమ్మెల్యే ఆనందరావు తదితరులు

అమలాపురం టౌన్‌, డిసెంబరు 29: నివర్‌ తుపానుతో నష్ట పోయిన రైతులను తక్షణం ఆదుకోవాలని డిమాండుచేస్తూ మాజీ ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక సబ్‌కలెక్టర్‌ కార్యాలయం వద్ద టీడీపీ నాయకులు ధర్నా నిర్వహించారు. టీడీపీ పార్లమెంటు జిల్లా శాఖ రైతుసంఘ అధ్యక్షుడు మట్టా మహలక్ష్మిప్రభాకరరావు  అధ్యక్షతన జరిగిన ధర్నాలో మాజీ ఎమ్మెల్యే ఆనందరావు, మాజీ ఎంపీ ఏజేవీబీ మహేశ్వరరావు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పెచ్చెట్టి చంద్రమౌళి, జిల్లా మహిళా అధ్యక్షురాలు పెచ్చెట్టి విజయలక్ష్మిలు మాట్లాడారు. రైతులను ఆదుకోవడంలో ప్రభు త్వం వైఫల్యం చెందిందని ఆరోపించారు. రంగు మారిన, మొలకలెత్తిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండు చేశారు. తక్షణం ఇన్‌పుట్‌ సబ్సిడీ అందించాలని, ఆత్మహత్య చేసుకున్న రైతులను ఆదుకోవాలని నినాదాలు చేశారు.  వినతిపత్రాన్ని సబ్‌కలెక్టర్‌ కార్యాలయం పరిపాలనాధికారి జవ్వాది వెంకటేశ్వరికి వినతిపత్రం అందజేశారు. టీడీపీ నాయ కులు వేగిరాజు వెంకటసత్యనారాయణ రాజు, దెందుకూరి సత్యనారాయణరాజు, గెల్లా మీనాకుమారి, మాడా మాధవి, మాకిరెడ్డి వీఎన్‌ఎస్‌ పూర్ణిమ, రాజులపూడి భీముడు, వేగిరాజు వెంకట్రాజు తదితరులు పాల్గొన్నారు.

ఆలమూరు: నివర్‌ తుపాను నష్టపరిహారాన్ని రైతులకు తక్షణం అందించాలని డిమాండ్‌ చేస్తూ టీడీపీ నాయకలు ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహశీల్దార్‌, వ్యవసాయ శాఖ కార్యాలయాల్లో అధికారులకు వినతిపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్య క్షుడు మెర్ల గోపాలస్వామి, నాయకులు రాయుడు సూరిబాబు, జక్కంశెట్టి వెంకటస్వామి, యన్నన సుబ్బారావు, ఈదల నల్లబాబు, వంటిపల్లి సతీష్‌, వక్కపట్ల లక్ష్మణరావు సాలి సత్యనారాయణ, తాడి శ్రీనివాసరెడ్డి, నైనాల శ్రీరామచంద్రమూర్తి, కడియాల శ్రీను, కేతా రాంబాబు  తదితరులు పాల్గొన్నారు. 

పి.గన్నవరం: నివర్‌ తుపానుతో దెబ్బతిన్న ప్రతీ రైతును తక్షణమే ఆదుకోకపోతే రైతులకు మద్దతుగా ఉద్యమం చేపడతామని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి డొక్కా నాథ్‌బాబు హెచ్చరించారు. పి.గన్నవరం మూడు రోడ్ల కూడలిలో రైతులకు మద్దతుగా నియోజకవర్గస్థాయి టీడీపీ నాయకులు నిరసన చేపట్టారు.  ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్యక్రమంలో గంగుమళ్ళ భద్రరావు, దాసరి వీరవెంకటసత్యనారాయణ, ఆరుమిల్లి లాల్‌బాబు, కుంపట్ల విష్ణుభగవాన్‌, తొలేటి సత్తిబాబు, డి.శ్రీనురాజు,  బి.పెదబాబు, గుడాల ఫణి, మట్టపర్తి రామకృష్ణ, శేరు శ్రీనుబాబు, సంసాని పెద్దిరాజు, చుట్టుగుళ్ళ కిషోర్‌ కె.బుజ్జి, వర్రే శ్రీను, ఆకుమర్తి ఆశీర్వాధం, బి.బాబు తదితరులు పాల్గొన్నారు.

రైతులను వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుంది

రాజోలు, డిసెంబరు 29: రైతులను వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చిన రాజప్ప, మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావులు తీవ్రంగా విమర్శించారు. మంగళవారం నిర్వహించిన పాదయాత్రలో  చినరాజప్ప, గొల్లపల్లి, నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలు పాల్గొ న్నారు. అనంతరం డిప్యూటీ తహశీల్దార్‌ దేవళ్ల శ్రీనివాస్‌కు గొల్లపల్లి వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా గొల్లపల్లి మాట్లాడుతూ రైతుల ప్రాణాలతో రాష్ట్ర ప్రభుత్వం చెలగాట మాడుతుందని ధ్వజమెత్తారు.   కార్యక్రమంలో అమలాపురం పార్లమెంటు నియోజకవర్గ తెలుగురైతు ప్రధాన కార్యదర్శి కసుకుర్తి త్రినాథస్వామి, దంతులూరి రామకృష్ణంరాజు,  టీడీపీ మండల అధ్యక్షుడు గుబ్బల శ్రీనివాస్‌, ప్రధాన కార్య దర్శి చాగంటి స్వామి, నియోజకవర్గ తెలుగు మహిళ అధ్యక్షు రాలు కాండ్రేగుల భవానీ, సాంస్కృతిక విభాగం అధ్యక్షురాలు కోటిపల్లి రత్నమాల, మోకా పార్వతి, మట్టా రాధ, ఎం.లక్ష్మి, వాణిజ్య విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు పిల్లి శ్రీరామ మూర్తి, కోఆర్డినేటర్‌ మానేపల్లి బాలాజీవేమా, గ్రామశాఖ అధ్యక్షుడు బేతినీడి శ్రీనివాసరావు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 

 


Updated Date - 2020-12-30T06:00:46+05:30 IST