రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం

ABN , First Publish Date - 2020-12-29T05:56:53+05:30 IST

రైతులను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు.

రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం

  • మాజీ ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ

జగ్గంపేట, డిసెంబరు 28: రైతులను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు. స్థానిక రావుల మ్మనగర్‌లో జ్యోతుల నవీన ఇంటి వద్ద మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర టీడీపీ ఉపా ధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ అధ్యక్షతన సోమవారం సమావేశం ఏర్పాటు చేశారు. కాకినాడ పార్లమెంట్‌ నియోజకవర్గ తెలుగురైతు జిల్లా అధ్యక్షుడు శ్రీనుబాబు, ప్రధాన కార్యదర్శి భాస్కరబాబు ముఖ్యఅతిథులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా శ్రీనుబాబు మాట్లాడుతూ పార్టీ ఆదేశానుసారం 3 రోజుల పాటు నియోజకవర్గంలోని మండలాల్లో టీడీపీ రైతు కమిటీలు ఏర్పాటుచేస్తా మన్నారు. భాస్కరబాబు మాట్లాడుతూ రైతులకు న్యాయం జరిగేవరకూ అంకితభావంతో పనిచేస్తామని, పోరాటాలు చేస్తామని తెలిపారు. జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు రథం పథకాన్ని ప్రస్తుత ప్రభుత్వం కొనసాగించాలని, వరికోత యంత్రాలు, నూర్పిడి మిషన్లు ఇచ్చి రైతులను ఆదుకోవాలన్నారు. ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం కూడా రైతులపై చిరుకన్ను వేస్తూ మద్దతు ధర కల్పిం చడం లేదన్నారు. కొన్నిరోజులుగా రైతులు దీక్షలు చేస్తుంటే ఆరుసార్లు చర్చలు జరిపారని అమరావతికోసం సంవత్సర కాలంగా ఉద్యమాలు రైతులు చేస్తుంటే ఒకసారి కూడా చర్చలకు పిలవకపోగా ప్రత్యామ్నాయ ఉద్యమాలు చేయించారన్నారు. జగనన్న తోడు అంటూ రైతులకు మేలు చేస్తారని ఎన్ని కల్లో హామీలు ఇచ్చిన వారు నేడు రైతుకు న్యాయం చేయలేకున్నారన్నారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఎస్‌వీఎస్‌ అప్పలరాజు, మారిశెట్టి భద్రం, జీను మణిబాబు, కొత్త కొండబాబు, పాలచర్ల సత్యనారాయణ, నీలాద్రి రాజు, పాండ్రంకి రాంబాబు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-29T05:56:53+05:30 IST