పెద్దాపురం ఎస్‌ఐను సస్పెండ్‌ చేయాలి

ABN , First Publish Date - 2020-12-01T06:14:10+05:30 IST

పెద్దాపురం, నవంబరు 30: దళితులను వేధించిన ఎస్‌ఐను తక్షణమే సస్పెండ్‌ చేయాలని, దళితులపై దాడి చేసి కులంపేరుతో దూషించినవారిని తక్షణమే అరెస్టు చేయాలంటూ రైతుకూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్నాకుల వీరాంజనేయులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు

పెద్దాపురం ఎస్‌ఐను సస్పెండ్‌ చేయాలి
కర్నాకులతో చర్చిస్తున్న సామర్లకోట ఎస్‌ఐ సుమంత్‌

రైతుకూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్నాకుల డిమాండ్‌  

పెద్దాపురం, నవంబరు 30: దళితులను వేధించిన ఎస్‌ఐను తక్షణమే సస్పెండ్‌ చేయాలని, దళితులపై దాడి చేసి కులంపేరుతో దూషించినవారిని తక్షణమే అరెస్టు చేయాలంటూ రైతుకూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్నాకుల వీరాంజనేయులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు చేపట్టిన ఆర్డీవో కార్యాలయం ముట్డడి కార్యక్రమ ం సోమవారం ఆందోళనకరంగా మారింది. ఈ సందర్భంగా కర్నాకుల మాట్లాడుతూ పులిమేరు గ్రామంలో అగ్రకులానికి చెందిన మల్లినీడి జయరాజు, అతడి కుమారులైన కృపాసాగర్‌, ప్రేమసాగర్‌ స్థానిక దళితులను దుర్భాషలాడడంతో పాటు కత్తులతో బెదిరించారన్నారు. దీనిపై ఫిర్యాదు చేస్తే పెద్దాపురం ఎస్‌ఐ ఏ.బాలాజీ మెతకవైఖరి అవలంభించారని, ఆర్థిక ప్రలోభాలకు లొం గిపోయారని ఆరోపించారు. దీంతో సామర్లకోట ఎస్‌ఐ సుమంత్‌ వీరాంజనేయులుతో చర్చించారు. జయరాజు, అతడి కుమారులపై అట్రాసిటీ కేసు నమోదు చేశామని, అరెస్టు చేస్తామని తెలిపారు. వారు సంతృప్తి చెందకపోవడంతో డీఎస్పీ అరిటాకుల శ్రీనివాసరావును కలిసి ఎస్‌ఐ తీరుపై ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై పూర్తిస్థాయిలో విచారణ జరిపించి ఎస్‌ఐపై చర్యలు తీసుకుంటామని డీఎస్పీ హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు. సంఘం జిల్లా కార్యదర్శి బి.రమేష్‌, ఏఐఎ్‌ఫటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.నాగభూషణం, పీడీఎ్‌సయూ విజృంభణ జిల్లా ప్రధాన కార్యదర్శి కడితి సతీష్‌, కె.వెంకటేశులు, జైభీమ్‌ యూత్‌ సభ్యులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-01T06:14:10+05:30 IST