కుటుంబ సమస్యలతో యువకుడి ఆత్మహత్య

ABN , First Publish Date - 2020-12-13T06:37:01+05:30 IST

కుటుంబ సమస్యలతో ఓ యువకుడు రాజమహేంద్రవరంలోని గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన చోటు చేసుకుంది.

కుటుంబ సమస్యలతో యువకుడి ఆత్మహత్య

రాజమహేంద్రవరం సిటీ, డిసెంబరు 12:  కుటుంబ సమస్యలతో ఓ యువకుడు రాజమహేంద్రవరంలోని గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన చోటు చేసుకుంది. టూటౌన్‌ పోలీసుల కథనం ప్రకారం వివరాల్లోకి వెళితే... ఽశంఖవరం మండలం పతంగి గ్రామానికి చెందిన ఎ.విజయబాబు (25) కుటుంబ సమస్యలతో ఇంట్లో గొడవ పడ్డాడు. దీంతో ఈనెల 6న ఇంటి నుంచి బయలుదేరి రాజమహేంద్రవరంలో ఉంటున్న స్నేహితుల ఇంటికి వచ్చాడు. ఈ నేపథ్యంలో స్నేహితులకు, కుటుంబీకులకు శుక్రవారంరాత్రి ఫోనుచేసి ఆత్మహత్యచేసుకుంటున్నానని చెప్పి ఫోనుపెట్టేశాడు. దీంతో వారు రాజమహేంద్రవరంలో అతనికోసం గాలించగా రోడ్డుకంరైలు బ్రిడ్జిపై 73వ పోల్‌వద్ద పైన అతనిచెప్పులు, బట్టలు కనిపించాయి. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. శనివారం స్థానిక దోబీఘాట్‌ వద్ద విజయబాబు మృతదేహాం లభ్యమైంది. దీంతో పోలీసులు గుర్తించి బంధువులకు సమాచారంఇచ్చి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రి మార్చురీకి తరలించి కేసు నమోదు చేశారు.

మనస్తాపంతో యువతి ఆత్మహత్య 

స్థానిక పీఅండ్‌టీ కాలనీకి చెందిన ఎం.శ్రీదేవి అనే యువతి తల్లి ఇటీవల మృతి చెందింది. తనకు వివాహం కాకపోవడం తల్లి లేకపోవడంతో మనస్తాపం చెందిన ఆమె శనివారం ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో ఫ్యాను ఉక్కుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ మేరకు మృతురాలి అన్న సుబ్రహ్మణ్యం ఇచ్చిన ఫిర్యాదు మేరకు త్రీటౌన్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రి మార్చురీకి తరలించారు.


Updated Date - 2020-12-13T06:37:01+05:30 IST