‘కరోనా’ సోకిందంటూ అసత్య ప్రచారం

ABN , First Publish Date - 2020-03-18T09:09:50+05:30 IST

కరోనా వైరస్‌ సోకిందని లోకల్‌ యాప్‌ ద్వారా ఓ యువకుడు తప్పుడు ప్రచారం చేసి తనను, తన

‘కరోనా’ సోకిందంటూ అసత్య ప్రచారం

యువకుడిపై పోలీసులకు ఫిర్యాదు


ముమ్మిడివరం, మార్చి 17: కరోనా వైరస్‌ సోకిందని లోకల్‌ యాప్‌ ద్వారా ఓ యువకుడు తప్పుడు ప్రచారం చేసి తనను, తన కుటుంబాన్ని ఆవేదనకు గురి చేశాడని ఓ వ్యక్తి మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ముమ్మిడివరం నగర పంచాయతీ 7వ వార్డు మాజీ కౌన్సిలర్‌ శీలం కృష్ణమూర్తికి కరోనా వైరస్‌ సోకిందని, వైద్యులు కాకినాడ ప్రభుత్వాసుపత్రి తీసుకెళ్లారని, 24 గం టల్లో రిపోర్టులు వస్తాయని అదే వార్డుకు చెందిన వైసీపీ నాయకుడు కముజు రమేష్‌ వాట్సాప్‌ నెం బరు ద్వారా సోమవారం లోకల్‌ యాప్‌లో ప్రచా రం చేశాడు. దీని వల్ల స్నేహితులు, బంధువులు ఫోన్‌చేసి పరామర్శిస్తున్నారని కృష్ణమూర్తి వాపోయాడు.


కాంట్రాక్టుకు ఒప్పుకున్న మూడు బిల్డింగ్‌ల యజమానులు రద్దు చేసుకున్నారని, తన వద్ద పనిచేయడానికి కూలీలు కూడా రావడంలేదని, అం దరూ దూరం పెడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశాడు. తాపీమేస్ర్తీగా పనిచేస్తున్న తనపై వచ్చిన ఈ అసత్య ప్రచారంతో ఆర్థికంగా నష్టపోయానని, ర మేష్‌ తనను, తన కుటుంబాన్ని మానసిక ఇబ్బం దులకు గురిచేశాడని పేర్కొన్నారు. కౌన్సిలర్‌ స్థానా నికి టీడీపీ అభ్యర్థిగా పోటీచేస్తున్న గంజా వెంకటే శ్వరరావు విజయానికి కృషి చేస్తున్నందున తనపై కక్షగట్టి రమేష్‌ ఈ దుష్ప్రచారాన్ని చేస్తున్నాడని కృష్ణమూర్తి ఫిర్యాదులో పేర్కొన్నాడు. రమేష్‌పై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరాడు.

Updated Date - 2020-03-18T09:09:50+05:30 IST