వలస కార్మికులను గుర్తించడంలో విఫలం

ABN , First Publish Date - 2020-05-13T09:46:00+05:30 IST

వలస కార్మికులను గుర్తించడంలో పాలకులు విఫలమయ్యారని వామపక్ష నాయకులు

వలస కార్మికులను గుర్తించడంలో విఫలం

డెయిరీఫారమ్‌ సెంటర్‌(కాకినాడ), మే 12: వలస కార్మికులను గుర్తించడంలో పాలకులు విఫలమయ్యారని వామపక్ష నాయకులు విమర్శించారు.  స్థానిక సుందరయ్య భవన్‌లో మంగళవారం జె.వెంకటేశ్వర్లు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ విశాఖ ఎల్‌జీ పాలిమర్స్‌ బాధితులకు న్యాయం చేయాలని కోరిన గ్రామస్థులు, ఇతర నాయకులపై పెట్టిన కేసులను తక్షణం ఎత్తివేయాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు, సీపీఎం జిల్లా కార్యదర్శి కేఎస్‌ శ్రీనివాస్‌, సీపీఐ(ఎంఎల్‌) న్యూడెమోక్రసీ జిల్లా నాయకుడు జె.వెంకటేశ్వర్లు, ఫార్వర్డు బ్లాక్‌ నాయకుడు అయినాపురపు సూర్యనారాయణ, గుబ్బల ఆదినారాయణ, రాగుల రాఘవులు పాల్గొన్నారు. 

Read more