బాబ్రీ కేసు కొట్టివేతపై హర్షాతిరేకాలు
ABN , First Publish Date - 2020-10-01T07:18:42+05:30 IST
అయోధ్యలో బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో 30మందిపై పెట్టిన కేసులు బుధవారం ఉత్తరప్రదేశ్‌లోని లక్నో సీబీఐ
ప్రత్తిపాడు, సెప్టెంబరు 30: అయోధ్యలో బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో 30మందిపై పెట్టిన కేసులు బుధవారం ఉత్తరప్రదేశ్‌లోని లక్నో సీబీఐ స్పెషల్‌కోర్టు తీర్పుపై ప్రత్తిపాడులో బీజేపీ నాయకులు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి సింగిల్‌దేవి సత్తిరాజు ఆధ్వర్యంలో పార్టీ నాయకులు స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు పత్రి రమణ, మదినే బాబ్జి, గున్నాబత్తుల రాజబాబు, ఊట సోమరాజు, గువేరా, ప్రవీణ్, వెంకటరమణ, లోవరాజు పాల్గొన్నారు.
జగ్గంపేట: బాబ్రీ మసీదు కూల్చివేత కేసు కొట్టివేయడం ప్రతి హిందూ విజయమని నగరానికి చెందిన దాట్ల కృష్ణవర్మ ఒక ప్రకటనలో అన్నారు. ఎక్కడ ధర్మం ఉంటుందో జయం అక్కడే ఉంటుందని ప్రధాని అన్నమాట నిజమని తెలిపారు.
కోటనందూరు: బాబ్రీ తీర్పుపై మండల బీజేపీ నేతలు హర్షం వ్యక్తం చేశారు. పార్టీ మండల అధ్యక్షుడు లాలం లోవరాజు ఆధ్వర్యంలో స్వీట్లు తినిపించుకున్నారు. కార్యక్రమంలో పల్లా రామకృష్ణ యాదవ్, జి.రాంబాబు పాల్గొన్నారు.
రౌతలపూడి: బాబ్రీ తీర్పుపై బీజేపీ నేతలు హర్షం వ్యక్తం చేశారు. 32మందిని నిర్ధోషులుగా ప్రకటించడం ఆనందంగా ఉందని పార్టీ నాయకులు ఊటా నాగశ్రీను అన్నారు. మాదగిరి శ్రీను, సత్యనారాయణ, ప్రసాద్, సత్యనారాయణ ఉన్నారు.
కేసు కొట్టివేయడం న్యాయ వ్యవస్థకే చీకటి రోజు: కర్నాకుల
జగ్గంపేట, సెప్టెంబరు 30: బాబ్రీ మసీదు కూల్చివేత కేసు కొట్టివేసి నిందితులను నిర్ధోషులుగా ప్రకటించడం న్యాయవ్యవస్థకే చీకటి రోజని రైతుకూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్నాకుల వీరాంజనేయులు తెలిపారు.