డిగ్రీ పరీక్షా ఫలితాల విడుదల

ABN , First Publish Date - 2020-10-27T06:05:40+05:30 IST

పీఆర్‌ ప్రభుత్వ అటానమస్‌ డిగ్రీ కళాశాలలో సెప్టెంబరులో నిర్వహించిన డిగ్రీ 6వ సెమిస్టర్‌, 2, 4వ సెమిస్టర్‌ బ్యాక్‌లాగ్‌ పరీక్షా ఫలితాలను సోమవారం ప్రిన్సిపాల్‌ చప్పిడి కృష్ణ విడుదల చేసారు.

డిగ్రీ పరీక్షా ఫలితాల విడుదల

కాకినాడ రూరల్‌, అక్టోబరు 26: పీఆర్‌ ప్రభుత్వ అటానమస్‌ డిగ్రీ కళాశాలలో సెప్టెంబరులో నిర్వహించిన డిగ్రీ 6వ సెమిస్టర్‌, 2, 4వ సెమిస్టర్‌ బ్యాక్‌లాగ్‌ పరీక్షా ఫలితాలను సోమవారం ప్రిన్సిపాల్‌ చప్పిడి కృష్ణ విడుదల చేసారు. 6వ సెమిస్టర్‌ పరీక్షలకు మొత్తం 668మంది విద్యార్థులు హాజరుకాగా 620మంది ఉత్తీర్ణత సాధించారన్నారు. ఫలితాలను కళాశాల వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చని తెలిపారు. కార్యక్రమంలో అకడమిక్‌ కోఆర్డినేటర్‌ హరిరామప్రసాద్‌, వైస్‌ప్రిన్సిపాల్‌ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-10-27T06:05:40+05:30 IST