నాయకుల ఆగడాలు చూస్తూ ఊరుకోం

ABN , First Publish Date - 2020-11-13T05:53:11+05:30 IST

పిఠాపురం, నవంబరు 12: అధికార పార్టీ నాయకుల ఆగడాలు చూస్తూ ఊరుకోమని మాజీ ఎమ్మెల్యే వర్మ హెచ్చరించారు. పట్టణంలో జగ్గయ్యచెరువు ప్రాంతంలోని తమ స్థలంపై కబ్జాదారుల కన్ను పడి వారి చేతుల్లో భౌతిక దాడులకు గురైన బాధితులను గురువారం మాజీ ఎమ్మెల్యే వర్మను కలిశారు

నాయకుల ఆగడాలు చూస్తూ ఊరుకోం

మాజీ ఎమ్మెల్యే వర్మ

పిఠాపురం, నవంబరు 12: అధికార పార్టీ నాయకుల ఆగడాలు చూస్తూ ఊరుకోమని మాజీ ఎమ్మెల్యే వర్మ హెచ్చరించారు. పట్టణంలో జగ్గయ్యచెరువు ప్రాంతంలోని తమ స్థలంపై కబ్జాదారుల కన్ను పడి వారి చేతుల్లో భౌతిక దాడులకు గురైన బాధితులను గురువారం మాజీ ఎమ్మెల్యే వర్మను కలిశారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ తమ స్థలాన్ని, తమను ఏం చేస్తారా అనే బాధతో బిక్కుబిక్కుమని కంటి మీద కునుకులేకుండా ఉన్నామన్నారు. దీనిపై వర్మ మాట్లాడుతూ స్థలాలు కబ్జా చేసి భౌతిక దాడులకు పాల్పడితే ఊరుకునేదిలేదన్నారు. తమపై దాడి చేశారంటూ పోలీసులను ఆశ్రయిస్తే బాధితులకు న్యాయం జరగకపోవడం దారుణమని, దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామన్నారు.

Updated Date - 2020-11-13T05:53:11+05:30 IST