నష్టపోయిన రైతులను ఆదుకోవాలి
ABN , First Publish Date - 2020-12-01T06:16:08+05:30 IST
డెయిరీఫారమ్ సెంటర్ (కాకినాడ), నవంబరు 30: ఏలేరు వరదలు, నివర్ తుఫాన్ ధాటికి పిఠాపురం నియోజకవర్గంలో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని మాజీ ఎమ్మెల్యే ఎస్‌వీఎ్‌సఎన్ వర్మ సోమవారం కలెక్టర్ డి.మురళీధర్‌రెడ్డిని వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భం

కలెక్టర్‌కు మాజీ ఎమ్మెల్యే వర్మ వినతి
డెయిరీఫారమ్ సెంటర్ (కాకినాడ), నవంబరు 30: ఏలేరు వరదలు, నివర్ తుఫాన్ ధాటికి పిఠాపురం నియోజకవర్గంలో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని మాజీ ఎమ్మెల్యే ఎస్‌వీఎ్‌సఎన్ వర్మ సోమవారం కలెక్టర్ డి.మురళీధర్‌రెడ్డిని వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వర్మ మాట్లాడుతూ గండ్లను వెంటనే పూడ్చాలని విజ్ఞప్తి చేశారు. రైతుకు ఎకరానికి రూ.25 వేలు పంట నష్టపరిహారం ఇవ్వాలని కోరారు. ఏలేరు వరద నీరు మొత్తం ఒక్క పిఠాపురానికే వదిలివేయడం వల్ల 70 శాతం రైతులు నష్టపోయారని, నివర్ తుఫాన్‌తో మిగిలిన 30 శాతం రైతులు నష్టపోయారన్నారు. తడిసిన, రంగు మారిన ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని ఆయన కోరారు. కార్యక్రమంలో మాజీ ఏఎంసీ చైర్మన్ మాదేపల్లి వినీల్‌వర్మ, టీడీపీ మండలాధ్యక్షుడు ఉలవకాయల దేవేంద్రుడు, అనిశెట్టి సత్యానందరెడ్డి, సఖుమళ్ల గంగాధర్, గుండ్ర సుబ్బారావు, జడ్పీటీసీ మాజీ సభ్యుడు బర్ల అప్పారావు, మడికి సన్యాసిరావు, బత్తుల రాజేష్, నల్లా శ్రీనివాస్ పాల్గొన్నారు.