అంబేడ్కర్‌ ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాలి

ABN , First Publish Date - 2020-11-13T06:03:07+05:30 IST

కిర్లంపూడి, నవంబరు 12: అంబేడ్కర్‌ ఆశయాలకు అనుగుణంగా నేటి యువత నడుచుకోవాలని మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కోరారు. గ్రామంలో

అంబేడ్కర్‌ ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాలి
అంబేడ్కర్‌ విగ్రహానికి నివాళులర్పించిన మాజీ మంత్రి ముద్రగడ

కిర్లంపూడి, నవంబరు 12: అంబేడ్కర్‌ ఆశయాలకు అనుగుణంగా నేటి యువత నడుచుకోవాలని మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కోరారు. గ్రామంలో కాపుల వీధిలో ఉన్న అంబేడ్కర్‌ విగ్రహానికి గురువారం ఆయన పూలమాలలు వేసి ఘనంగా నివాళుర్పించారు. విగ్రహం నెలకొల్పి 3 సంవత్సరాలు పూర్తికావడంతో ఈ కార్యక్రమాన్ని దళితులు, కాపులు నిర్వహించారు. మాజీ సర్పంచ్‌ పెంటకోట నాగబాబు, సల్లా సత్యనారాయణ, రాపేటి పెద్ద, గుడాల వెంకటరత్నం, సూరిబాబు పాల్గొన్నారు. 

Updated Date - 2020-11-13T06:03:07+05:30 IST