-
-
Home » Andhra Pradesh » East Godavari » ex minister died
-
మాజీ మంత్రి ప్రసాదరావు కన్నుమూత
ABN , First Publish Date - 2020-12-28T06:34:51+05:30 IST
మాజీ మంత్రి మోకా శ్రీవిష్ణు ప్రసాదరావు (90) కన్నుమూశారు.

కాట్రేనికోన, డిసెంబరు 27: మాజీ మంత్రి మోకా శ్రీవిష్ణు ప్రసాదరావు (90) కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో అమలాపురంలోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తుది శ్వాస విడిచారు. ఆయనకు భార్య, ముగ్గురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. పెద్దల్లుడు విజయశిఖామణి తిరుపతి ఎమ్మెల్యేగా పనిచేశారు. మూడో కుమారుడు ఆనందసాగర్ కాట్రేనికోన గ్రామ సర్పంచ్‌గా పని చేశారు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉన్నారు. పెద్ద కుమారుడు కుమార్‌బాబా పితృ దేవ వరప్రసాద్ (బోనస్) ఎంపీటీసీగా పని చేశారు. భార్య చంద్రనాగరత్నం కాట్రేనికోన ఎంపీటీసీగా పని చేశారు. ప్రసాదరావు 1972 నుంచి 1977 వరకు అల్లవరం ఎమ్మెల్యేగా పని చేశారు. 1977లో కొత్తగా ఏర్పడిన ముమ్మిడివరం నియోజకవర్గానికి మొదటి ఎమ్మెల్యేగా కాంగ్రెస్ తరపున ఎన్నికయ్యారు. మర్రి చెన్నారెడ్డి మంత్రివర్గంలో మార్కెటింగ్, గిడ్డంగుల శాఖ మంత్రిగా ఉన్నారు. కాట్రేనికోన సర్పంచ్‌గా 18ఏళ్లు ఏకఛత్రాధిపత్యంగా వ్యవహ రించారు. ప్రసాదరావు మృతదేహానికి మంత్రి పినిపే విశ్వరూప్, ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్‌కుమార్, పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, మాజీ ఎమ్మెల్యేలు చెల్లి వివేకానంద, దాట్ల బుచ్చిబాబు, వైసీపీ మండల అధ్యక్షుడు నల్లా నరసింహమూర్తి, టీడీపీ మండల అధ్యక్షుడు నడింపల్లి సుబ్బరాజు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నాగిడి నాగేశ్వరరావు, వైసీపీ వాణిజ్య విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నడింపల్లి సూర్యనారాయణరాజు (సూరిబాబు), టీడీపీ అవమలాపురం పార్లమెంటరీ ఇన్‌చార్జి గంటి హరీష్‌మాధుర్, ఏడిద చక్రపాణిరావు, ఏడిద సుబ్బి, మాజీ సర్పంచ్ ఎస్‌ఆర్‌కే లక్ష్మీకాంతరాజు, నేల కిశోర్, రంబాల చిట్టిబాబు, సంసాని నాగేశ్వరరావు, మోకా అప్పాజీ, గంటి వెంకటసుధాకర్ పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.