ప్రైవేట్ ఉపాధ్యాయులకు నిత్యావసరాల కిట్లు
ABN , First Publish Date - 2020-08-11T10:57:17+05:30 IST
రాజమహేంద్రవరంలోని యూటీఎఫ్ కార్యాలయంలో సంఘ నగరాధ్యక్షుడు జేవీవీ సుబ్బారావు అధ్యక్షతన జరిగిన ఆవిర్భావ వేడుకలో రాష్ట్ర ..

రాజమహేంద్రవరం సిటీ, ఆగస్టు 10: రాజమహేంద్రవరంలోని యూటీఎఫ్ కార్యాలయంలో సంఘ నగరాధ్యక్షుడు జేవీవీ సుబ్బారావు అధ్యక్షతన జరిగిన ఆవిర్భావ వేడుకలో రాష్ట్ర కౌన్సిలర్ షరీఫ్ యూటీఎఫ్ పతాకాన్ని ఆవిష్కరిం చారు. జిల్లా కార్యదర్శి రూపాష్ యూటీఎఫ్ విశిష్టతను, యూనియన్ ఆవశ్యక తను వివరించారు. అనంతరం ప్రైవేట్ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయు లకు నిత్యావసరాల కిట్లను అందించారు.