ఫ్యాన్ వద్దనుకుని సైకిల్ ఎక్కిన ఏనుగు సత్తిబాబు

ABN , First Publish Date - 2020-10-19T18:32:50+05:30 IST

ప్రత్తిపాడు మండలం చిన్న శంకర్ల పూడి గ్రామానికి చెందిన మాజీ నీటి సంఘం అధ్యక్షులు ఏనుగు సత్తిబాబు టీడీపీలో చేరారు. మాజీ ఎమ్మెల్యే వరుపుల రాజా సమక్షంలో సోమవారం

ఫ్యాన్ వద్దనుకుని సైకిల్ ఎక్కిన ఏనుగు సత్తిబాబు

కాకినాడ: ప్రత్తిపాడు మండలం చిన్న శంకర్ల పూడి గ్రామానికి చెందిన మాజీ నీటి సంఘం అధ్యక్షులు ఏనుగు సత్తిబాబు టీడీపీలో చేరారు. మాజీ ఎమ్మెల్యే వరుపుల రాజా సమక్షంలో సోమవారం టీడీపీ కండువా కప్పుకున్నారు. కాగా... ప్రత్తిపాడు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే పర్వత ప్రసాద్ ఈనెల 18న సాయంత్రం ఐదు గంటల సమయంలో సదరు నీటి సంఘం అధ్యక్షులు ఏనుగు సత్తిబాబు ఇంటికి వెళ్లి మాట్లాడారు. టీడీపీలో చేరవద్దని కోరారు. ఎమ్మెల్యే ప్రతిపాదనను తోసిపుచ్చిన ఆయన.. ఈరోజు ఉదయం 10 గంటల సమయంలో వరుపుల రాజా సమక్షంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున చిన్న శంకర్ల పూడి టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 

Updated Date - 2020-10-19T18:32:50+05:30 IST