ఏపీ ఎంసెట్‌ ధృవపత్రాల పరిశీలన ప్రారంభం

ABN , First Publish Date - 2020-10-24T06:20:58+05:30 IST

ఇంజనీరింగ్‌, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి ఏపీఎంసెట్‌ వెబ్‌కౌన్సెలింగ్‌ ప్రక్రియ శుక్రవారం ప్రారంభమైంది. జిల్లావ్యాప్తంగా కాకినాడ జేఎన్టీయూకేలోని యూసీఈకే, ఆంధ్రా పాలిటెక్నిక్‌ కళాశాలల్లో సహాయ కేంద్రాలను ఏర్పాటు చేశారు.

ఏపీ ఎంసెట్‌ ధృవపత్రాల పరిశీలన ప్రారంభం
జేఎన్‌టీయూకేలో వెబ్‌కౌన్సెలింగ్‌కు హాజరైన విద్యార్థులు

  • తొలిరోజు 420మంది హాజరు

జేఎన్టీయూకే, అక్టోబరు 23: ఇంజనీరింగ్‌, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి ఏపీఎంసెట్‌ వెబ్‌కౌన్సెలింగ్‌ ప్రక్రియ శుక్రవారం ప్రారంభమైంది. జిల్లావ్యాప్తంగా కాకినాడ జేఎన్టీయూకేలోని యూసీఈకే, ఆంధ్రా పాలిటెక్నిక్‌ కళాశాలల్లో సహాయ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 1 నుంచి 20,000 ర్యాంకు వరకు గల విద్యార్థుల ధ్రువపత్రాలను ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించాకా పరిశీలించారు. మొ దటిరోజు కొంతమంది విద్యార్థులు తాము ఎలా చేయాలో అర్థంకాక సహాయ కేంద్రాలకు ఎక్కువ సంఖ్యలో ధ్రువపత్రాల పరిశీలనకు హాజరయ్యారు. జేఎన్టీయూకేలో 1 నుంచి 10,000 ర్యాంకు వరకుగల అభ్యర్థుల ధ్రువపత్రాలను 264మంది... ఏపీటీ సహాయకేంద్రంలో 10,001నుంచి 20,000 ర్యాంకు పరిశీలించగా 156మంది.. మొత్తం రెండు కేంద్రాల్లో 420మంది అభ్యర్థులు హాజరైనట్టు సమన్వయకర్తలు తెలిపారు. ఈనెల 27 వరకు ఈ పరిశీలన కొనసాగనుంది. శనివారం జేఎన్టీయూకేలో ఉదయం 9గంటల నుంచి 20,001 నుంచి 27,500 వరకు, మధ్యాహ్నం ఒంటిగం ట నుంచి 27,501 నుంచి 35,000వరకు.. ఏపీటీలో ఉదయం 35,001 నుంచి 42,500 వరకు, మ ధ్యాహ్నం 42,501 నుంచి 50,000 వరకు ధ్రువపత్రాలను ఆన్‌లైన్‌లో పరిశీలించనున్నారు.

Updated Date - 2020-10-24T06:20:58+05:30 IST