సచివాలయ ఉద్యోగులు స్థానికంగా నివసించాలి

ABN , First Publish Date - 2020-11-25T05:52:40+05:30 IST

సచివాలయ ఉద్యోగులు ఆయా గ్రామాల్లోనే నివాసం ఉండాలని జాయింట్‌ కలెక్టర్‌ రాజకుమారి ఆదేశించారు.

సచివాలయ ఉద్యోగులు స్థానికంగా నివసించాలి

రాజానగరం, నవంబరు 24: సచివాలయ ఉద్యోగులు ఆయా గ్రామాల్లోనే నివాసం ఉండాలని జాయింట్‌ కలెక్టర్‌ రాజకుమారి ఆదేశించారు. రాజానగరం, లాలాచెరువుల్లోని సచివాలయాలను మంగళవారం ఆమె సందర్శించారు. రికార్డులను పరిశీలించి తగు సూచనలు ఇచ్చారు. విధిగా బయోమెట్రిక్‌ హాజరు వేసి విధులకు హాజరు కావాలన్నారు. సర్టిఫికెట్లను సకాలంలో అందించాలని సూచించారు. ఈవోపీఆర్డీ బొజ్జిరావు, పంచాయతీ కార్యదర్శి మేకా ప్రసాద్‌బాబు, వీఆర్వో నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Read more