విద్యా కానుక కిట్లు వచ్చేశాయ్‌

ABN , First Publish Date - 2020-07-20T11:09:49+05:30 IST

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు నూతన విద్యా సంవత్సరంలో ‘జగనన్న విద్యా కానుక’ పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

విద్యా కానుక కిట్లు వచ్చేశాయ్‌

సామర్లకోట, జూలై 19:  ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు నూతన విద్యా సంవత్సరంలో ‘జగనన్న విద్యా కానుక’ పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి సంబంధించిన విద్యా శాఖ కమిషనరు  వాడ్రేవు చినవీరభద్రుడు విడుదల చేసిన మార్గదర్శకాలు జిల్లా విద్యాశాఖ కార్యాలయానికి అందాయి. ఏడు రకాల సామగ్రితో కూడిన కిట్లు జిల్లాకు చేరుకున్నట్టు విద్యా శాఖ కమ్యూనిటీ మొబలైజేషన్‌ అధికారి వైవీ శివరామకృష్ణయ్య ఆదివారం వెల్లడించారు.


కిట్‌లో మూడు జతల యూనిఫామ్‌, ఒక సెట్‌ నోటుపుస్తకాలు, పాఠ్య పుస్తకాలు, ఒక జత బూట్లు, రెండు జతల సాక్సులు, బెల్టు, బ్యాగు ఉంటాయి. ఎంపిక చేసిన పంపిణీదారుల నుంచి ఈ కిట్లు మండల విద్యా వనరుల కేంద్రాలకు చేరుకుంటాయన్నారు. వీటిని అధికారులు భద్రపరచడమే కాక అన్ని వస్తువులనూ సరిచూసుకుని ఎక్కువ, తక్కువలుంటే అధికారుల దృష్టికి తీసుకెళ్లాల్సి ఉంటుంది. బ్యాగ్‌లను విద్యార్థుల తరగతి బట్టి మూడు సైజులలో అందిస్తున్నారు. జిల్లాలో ఈ కిట్ల పంపిణీని పర్యవేక్షించేందుకు రాష్ట్రస్థాయి అధికారిని నియమించనున్నారు.

Updated Date - 2020-07-20T11:09:49+05:30 IST