విద్యారంగంలో సాంకేతిక పరిజ్ఞానానికి అధిక ప్రాధాన్యం

ABN , First Publish Date - 2020-11-13T06:20:01+05:30 IST

విద్యారంగంలో సాంకేతిక పరిజ్ఞానానికి అధిక ప్రాధాన్యమివ్వాలని, ఆధునిక విధానాలను అనుసరించి నాణ్యమైన విజ్ఞానాన్ని అందించాలని ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య మొక్కా జగన్నాథరావు అన్నారు.

విద్యారంగంలో సాంకేతిక పరిజ్ఞానానికి అధిక ప్రాధాన్యం

  • జాతీయ వెబ్‌నార్‌లో ‘నన్నయ’ వీసీ జగన్నాథరావు 

 దివానచెరువు, నవంబరు 12: విద్యారంగంలో సాంకేతిక పరిజ్ఞానానికి అధిక ప్రాధాన్యమివ్వాలని, ఆధునిక విధానాలను అనుసరించి నాణ్యమైన విజ్ఞానాన్ని అందించాలని ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య మొక్కా జగన్నాథరావు అన్నారు. యూనివర్సిటీ విద్యా కళాశాల ఆధ్వర్యంలో విద్యలో సాంకేతిక పరిజ్ఞానం-అనుకూలతలు, పర్యవసానాలపై రెండురోజుల జాతీయ వెబినార్‌ను గురువారం నిర్వహించారు. దీనికి చైర్మనగా ప్రిన్సిపాల్‌ కె.సుబ్బారావు, కన్వీనర్‌గా కోర్సు కోఆర్డినేటర్‌ జి.ఎలీషాబాబు వ్యవహరించారు. కార్యక్రమానికి వీసీ ముఖ్యఅతిథిగా విచ్చేసి మాట్లాడారు. ఆఽధునిక యుగంలో సాంకేతిక పరిజ్ఞానం విస్తృతంగా అభివృద్ధి చెందుతోందని అన్ని రంగాలు సాంకేతికతతో మంచి ఫలితాలను సాధిస్తున్నాయని చెప్పారు. విద్యారంగంలో కూడా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని మెరుగైన ఫలితాలను సాధించవచ్చని చెప్పారు. జె-స్టోర్‌, జె-గేట్‌, ఈ-కంటెంట్‌, ఆనలైన క్లాసులు వంటి సాంకేతిక విధానాలను విశ్వవిద్యాలయంలో ప్రారంభించి విద్యా ప్రగతికి  పాటుపడుతున్నామని వీసీ అన్నారు. రిజిసా్ట్రర్‌ ఆచార్య బట్టుగంగారావు మాట్లాడుతూ కొవిడ్‌ సమయంలో విశ్వవిద్యాలయంలో అనేక కార్యక్రమాల ద్వారా సాంకేతికవిజ్ఞానాన్ని అందించామన్నారు. దీనిని మార్గదర్శకంగా తీసుకొని అనుబంధ కళాశాలలు సాంకేతిక పరిజ్ఞానంలో అభివృద్ధి సాధించాలని చెప్పారు. ప్రస్తుతం 1/3 వంతు క్లాసులు జరుగుతున్నాయని మిగిలిన విద్యార్థులకు అవసరమైన విజ్ఞానాన్ని నాణ్యమైన ఆనలైన విధానాల ద్వారా అందించాలని చెప్పారు. సదస్సులో ఆచార్య కేపీ సుబ్బారావు, ఆచార్య  కె.పుష్పా నందం, ఆచార్య బి.రమేష్‌బాబు, డా.వి.పెర్సిస్‌ ఉపన్యాసించారు. కార్యక్రమంలో కో-కన్వీనర్లు ఆర్‌.సాంబశివరావు, ఎం.గోపాలకృష్ణ, జె.రాజమణి, ఎఫ్‌.సుజాత, కేఎస్‌ఆర్‌ రాజేశ్వరిదేవి పాల్గొన్నారు.

Updated Date - 2020-11-13T06:20:01+05:30 IST