మానవత్వం అంటే ఇదే..

ABN , First Publish Date - 2020-09-25T01:41:03+05:30 IST

కష్ట కాలంలో అండగా నిలబడడమే మానవత్వం. అలా చేసి నిరూపించారు పోలీసులు. తూర్పుగోదావరి జిల్లా తునిలో 2009 బ్యాచ్ ఎస్‌ఐలు

మానవత్వం అంటే ఇదే..

కాకినాడ: కష్ట కాలంలో అండగా నిలబడడమే మానవత్వం. అలా చేసి నిరూపించారు పోలీసులు. తూర్పుగోదావరి జిల్లా తునిలో 2009 బ్యాచ్ ఎస్‌ఐలు మానవత్వాన్ని చాటుకున్నారు. కోవిడ్‌తో కన్నుమూసిన దివంగత ఎస్ఐ అల్లు దుర్గారావు కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయాన్ని అందించి శభాష్ అనిపించుకున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల 2009 బ్యాచ్ ఎస్‌ఐలు  గురువారం తుని వచ్చారు. తమ బ్యాచ్‌మెట్ చనిపోవడంతో ఆ ఇంటికి వచ్చి ఆదరించారు. పెద్ద కుమార్తె‌కు 10 లక్షలు, చిన్న కుమార్తె‌కు 10 లక్షలు, దుర్గారావు తల్లిదండ్రులకు 5 లక్షలు, ఆయన భార్యకు 3 లక్షలు రూపాయల చొప్పున ఫిక్స్డ్ డిపాజిట్ చేసి చెక్కులను అందించారు. అలాగే దుర్గారావు పెద్ద కార్యానికి కూడా కావాల్సిన నగదును కూడా ఎస్సైలంతా కలిసి అందజేశారు. మొత్తం 28లక్షలు సాయం చేసి ఆ కుటుంబానికి అండగా నిలిచి ప్రజలతో ప్రశంసలు అందుకుంటున్నారు.
Updated Date - 2020-09-25T01:41:03+05:30 IST