నేడు తూర్పు గోదావరి జిల్లావ్యాప్తంగా కర్ఫ్యూ

ABN , First Publish Date - 2020-07-19T14:35:56+05:30 IST

జిల్లాలో వేగంగా వ్యాప్తి చెందుతున్న కరోనా కేసులను పరిగణలోకి తీసుకుని..

నేడు తూర్పు గోదావరి జిల్లావ్యాప్తంగా కర్ఫ్యూ

ఆదివారం ఉదయం 6గంటల నుంచి సోమవారం ఉదయం 6గంటల వరకు బంద్..

వైద్య, ప్రభుత్వ సేవలకు మినహాయింపు: కలెక్టర్ మురళీధర్‌రెడ్డి


కాకినాడ(ఆంధ్రజ్యోతి): జిల్లాలో వేగంగా వ్యాప్తి చెందుతున్న కరోనా కేసులను పరిగణలోకి తీసుకుని 24గంటలపాటు సంపూర్ణ లాక్‌డౌన్ అమలుచేస్తున్నట్టు కలెక్టర్ డీ మురళీధర్‌రెడ్డి ప్రకటించారు. డిజాస్టర్ మేనేజ్‌మెంట్ 2005 చట్టం మేరకు ఆదివారం ఉదయం 6గంటల నుంచి సోమవారం ఉదయం 6గంటల వరకు జిల్లావ్యాప్తంగా కర్ఫ్యూ అమలు చేస్తారు. అత్యవసర వైద్య సేవలు, ప్రభుత్వ సేవలకు మినహాయింపు ఇచ్చారు. అలాగే ఉదయం పూట నిత్యావసర సరుకుల కొనుగోలు కోసం కాస్త వెసులుబాటు కల్పించారు. నాన్ వెజ్ మార్కెట్లకు ఎక్కడా అనుమతి లేదు.

Updated Date - 2020-07-19T14:35:56+05:30 IST