విద్యుదాఘాతంతో యువకుడి మృతి

ABN , First Publish Date - 2020-03-02T10:50:49+05:30 IST

విద్యుదాఘాతంతో యువకుడి మృతి

విద్యుదాఘాతంతో యువకుడి మృతి

కాట్రేనికోన, మార్చి 1: విద్యుదాఘాతంతో ఓ యువకుడు మృతి చెందాడు. కాట్రేనికోన మండలం మిలిటరీ పేటలో ఆక్వా చెరువులను పేరాబత్తుల హరిబాబు సాగు చేస్తున్నాడు. ఎస్‌ఐ బి.సంపత్‌కుమార్‌ వివరాల ప్రకారం..  చెరువుల వద్ద మొల్లేటిమొగకు చెందిన కర్రి లక్ష్మీనరసింహారావు(24) పని చేస్తున్నాడు. ఆదివారం ఉదయం చెరువులో మేత చల్లే సమయంలో విద్యుత్‌ వైరు తగలడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. విద్యుత్‌ వైర్ల విషయంలో యజమాని నిర్లక్ష్యం కారణంగానే నరసింహారావు మృతి చెందినట్టు బంధువులు ఆరోపిస్తున్నారు. దీనిపై కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు.


గోదావరిలో పడి మత్స్యకారుడి మృతి

ఐ.పోలవరం: వేటకు వెళ్లిన మత్స్యకా రుడు గోదావరిలో పడి మృతిచెందినట్టు ఐ.పోలవరం ఎస్‌ఐ ఎస్‌.రాము తెలిపారు. యానాం గిరియాంపేటకు చెందిన రేకాడి మహేష్‌(34) ఆదివారం తెల్లవారుజామున చేపలవేటకు వెళ్లాడు. ఐ.పోలవరం మండలం భైరవపాలెం సమీపంలో సముద్రంలో వల లాగుతుండగా అదుపు తప్పి వలలో పడి మృతిచెందినట్టు పోలీసులు తెలిపారు. మృతుడి తండ్రి చినరామన్న ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు.


Updated Date - 2020-03-02T10:50:49+05:30 IST