కుతుకులూరులో ఇరువర్గాల ఘర్షణ

ABN , First Publish Date - 2020-03-02T10:49:55+05:30 IST

కుతుకులూరులో ఇరువర్గాల ఘర్షణ

కుతుకులూరులో ఇరువర్గాల ఘర్షణ

ఇంటిపై దాడికి యత్నం.. ఇద్దరికి స్వల్ప గాయాలు 

పోలీసుల అదుపులో 11 మంది 


అనపర్తి, మార్చి 1: అనపర్తి మండలం కుతుకులూరులో ఆదివారం రెండు వర్గాల మధ్య ఘర్షణ ఉద్రిక్తతకు దారి తీసింది. ఒక వర్గానికి చెందిన వ్యక్తి ఇంటిపై మరో వర్గం దాడికి పాల్పడింది. బాధితులు, పోలీసుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన సత్తి ఆంజనేయరెడ్డి, కొవ్వూరి మురళీ వెంకటకృష్ణారెడ్డిలు పలు వ్యాపారాల్లో భాగస్వాములు. లావాదేవీల్లో అభిప్రాయ బేధాలున్నాయి. గత నెల 23న మురళీకృష్ణారెడ్డి.. ఆంజేయరెడ్డిని ఫోన్‌లో దుర్భాషలాడటంతో విభేదాలు తలెత్తాయి. ఇద్దరి మధ్య సయోధ్యకు పెద్దలు చేసిన ప్రయత్నం ఫలించలేదు. ఆదివారం మురళీ కృష్ణారెడ్డి తన వర్గీయులు కొవ్వూరి దుర్గారెడ్డి, కర్రి ప్రసాదరెడ్డి, పడాల రామారెడ్డి, పడాల వెంకటరెడ్డి, పడాల శ్రీనివాసరెడ్డి, కుక్కల కరుణతో సహా వంద మందితో ఆంజనేయరెడ్డి ఇంటిపై దాడికి యత్నించాడు. ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కొందరిని అదుపులోకి స్టేషన్‌కు తరలించారు. కాగా తమ ఇంటిపై దాడి చేసేందుకు రాజమహేంద్రవరం నుంచి గూండాలను తీసుకువచ్చారని ఆంజనేయరెడ్డి చెబుతున్నారు. కుతుకులూరులో ఇరు వర్గాలను చెదరగొట్టడంతో వారంతా అనపర్తికి చేరుకుని కెనాల్‌ రోడ్డుపై దాడులకు దిగారు. దీంతో అనపర్తిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రాయవరం ఎస్‌ఐ శ్రీనివాస్‌ నాయక్‌ రంగంలోకి దిగి ఘర్షణలను అదుపుచేశారు. సత్తి ఆంజనేయరెడ్డి ఫిర్యాదు మేరకు 11 మందిని అదుపులోని తీసుకున్నామని, వీడియోల ఆధారంగా మరింత మందిని అరెస్ట్‌ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని అనపర్తి ఏఎస్‌ఐ కేవీవీ సత్యనారాయణ తెలిపారు.


Updated Date - 2020-03-02T10:49:55+05:30 IST