విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే చర్యలు

ABN , First Publish Date - 2020-11-26T06:19:32+05:30 IST

గ్రామ సచివా లయ ఉద్యోగులు బాధ్యతాయుతంగా పనిచేయాలని, ఏమాత్రం అలసత్వం వహించినా చర్యలు తప్పవని జడ్పీ సీఈవో ఎన్‌వీవీ.సత్యనారాయణ హెచ్చరించారు.

విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే చర్యలు
మాట్లాడుతున్న సీఈవో సత్యనారాయణ

జడ్పీ సీఈవో సత్యనారాయణ

అమలాపురం టౌన్‌, నవంబరు 25: గ్రామ సచివా లయ ఉద్యోగులు బాధ్యతాయుతంగా పనిచేయాలని, ఏమాత్రం అలసత్వం వహించినా చర్యలు తప్పవని జడ్పీ సీఈవో ఎన్‌వీవీ.సత్యనారాయణ హెచ్చరించారు. క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పథకాలను అమ లుచేసే బాధ్యత సచివాలయ ఉద్యో గులపై ఉన్నందున జవాబు దారీతనంతో పనిచేయాలని సూచించారు. అమలా పురం అంబేడ్కర్‌ కమ్యూనిటీ హాల్‌లో బుధవారం డివిజన్‌ స్థాయి సచివాలయ ఉద్యోగులు, కార్యదర్శుల శిక్షణా కార్యక్ర మం డివిజనల్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌ వి.శాం తామణి ఆధ్వర్యంలో జరిగింది. తొలుత సబ్‌కలెక్టర్‌ హిమాన్షుకౌశిక్‌ జ్యోతి ప్రజ్వలనచేసి శిక్షణను ప్రారంభించారు. ముఖ్య అతిథిగా సీఈవో సత్యనారాయణ మాట్లా డుతూ సచివాలయ ఉద్యోగులకు సంబంధించి కేటా యించిన విధులు, సీసీఏ రూల్స్‌పై అవగాహన కల్పిం చారు. అమరావతి నుంచి వచ్చిన డిప్యూటీ డైరెక్టర్‌ శ్రీకాంత్‌  సచి వాలయ ఉద్యోగుల విధులు, బాధ్యతల గురించి పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరిం చారు.  డీపీవో ఆర్‌.విక్టర్‌, ఎంపీడీవోలు ఎం.ప్రభా కరరావు, కేసీహెచ్‌. అప్పారావు, ఉండ్రు బాబ్జిరాజులు, ఈవోపీఆర్డీ జి.మల్లికార్జునరావులు శిక్షణ ఇచ్చారు. 

సచివాలయాల ద్వారా సత్వర సేవలు

గ్రామ సచివాలయాల ద్వారా ప్రజలకు సత్వర సేవలు అందజేయాలని జడ్పీ సీఈవో ఎన్‌వీవీ.సత్య నారాయణ అన్నారు. బుధవారం బండారులంక-1 గ్రామ సచివాలయాన్ని సీఈవో ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 26 నుంచి గ్రామస్థాయి నుంచి మండల, డివి జన్‌, జిల్లా స్థాయిల్లో పరిసరాల పరిశుభ్రతపై పక్షోత్స వాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. సచివాలయంలోని రికా ర్డులను, సిబ్బంది పనితీరును పరిశీలించి ఆయన సం తృప్తి వ్యక్తం చేశారు. ఎంపీడీవో ఎం.ప్రభాకరరావు, కార్యదర్శి జీఎస్‌.నారాయణరావు పాల్గొన్నారు.


Updated Date - 2020-11-26T06:19:32+05:30 IST