-
-
Home » Andhra Pradesh » East Godavari » dsp case enquiry
-
అట్రాసిటీ కేసుపై డీఎస్పీ విచారణ
ABN , First Publish Date - 2020-10-31T06:32:33+05:30 IST
ఉప్పంగలలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుపై డీఎస్పీ వి.భీమారావు శుక్రవారం విచారణ చేపట్టారు.

తాళ్లరేవు, అక్టోబరు 30: ఉప్పంగలలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుపై డీఎస్పీ వి.భీమారావు శుక్రవారం విచారణ చేపట్టారు. ఫిర్యాది దడాల సువర్ణలత, గ్రామస్థులు, మద్యవర్తుల నుంచి ఆయన స్టేట్‌మెంట్లు రికార్డులు చేశారు. ఈసందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ కేసు విచారణలో ఉందని, త్వరలోనే నిందితుడిని అరెస్టుచేస్తామని తెలిపారు. దళిత మహిళ ఫీల్డ్‌అసిస్టెంట్ స్వర్ణలతను అసభ్యకరంగా దూషించిన వ్యక్తిని తక్షణమే అరెస్టు చేయాలని న్యాయవాది యెడ్ల కుటుంబరావు, వడ్డి ఏడుకొండలు, కాలిపల్లి బాలసుబ్రహ్మణ్యం డిమాండ్ చేశారు. కోరింగ ఎస్‌ఐ వై.సతీష్, సిబ్బంది పాల్గొన్నారు.