ఎండిన ‘మొక్కజొన్న’
ABN , First Publish Date - 2020-04-01T10:28:37+05:30 IST
కరోనా ప్రభావంతో మొక్కజొన్న రైతులు కష్టాలపాల య్యారు. లాక్‌డౌన్ వల్ల కూలీలు రాక ఎక్కడ పంట అక్కడే పొలాల్లోనే ఉండి

దేవీపట్నం, మార్చి 31: కరోనా ప్రభావంతో మొక్కజొన్న రైతులు కష్టాలపాల య్యారు. లాక్‌డౌన్ వల్ల కూలీలు రాక ఎక్కడ పంట అక్కడే పొలాల్లోనే ఉండి పోయింది. పంట చేతికి వచ్చే సమయానికి కరోనా వైరస్ ప్రభావంతో తాము తీవ్రంగా నష్టపోయామని మొక్కజొన్న రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రవా ణా సౌకర్యం లేక పంట కొనడానికి వ్యాపారులు రావడంలేదు.
దీంతో కల్లాల్లోనే మొక్కజొన్న ఉండిపోయింది. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినప్పటకీ కరోనాతో అవి కూడా నిలిచి పోయాయి. ఏంచేయాలో తోచక రైతులు ఆందోళన చెందుతున్నారు. నిత్యావసరాలు లేకపోవడంతో తినడానికి కూడా కొన్ని గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.