-
-
Home » Andhra Pradesh » East Godavari » Dr G Somasundarao
-
ఐదు అనుమానిత కేసులకు ప్రభుత్వాసుత్రిలో చికిత్స
ABN , First Publish Date - 2020-03-25T10:10:00+05:30 IST
రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రిలో దగ్గు, జలుబుతో బాధపడుతున్న ఐదు కేసులకు ప్రత్యేక చికిత్స అందిస్తున్న ట్టు ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జి.సోమసుందరరావు తెలిపారు.

రాజమహేంద్రవరం అర్బన్, మార్చి 24 : రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రిలో దగ్గు, జలుబుతో బాధపడుతున్న ఐదు కేసులకు ప్రత్యేక చికిత్స అందిస్తున్న ట్టు ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జి.సోమసుందరరావు తెలిపారు. కరోనా వైరస్ అనుమానిత కేసుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఐసొలేషన్ వార్డులో వీరికి చికిత్స అందజేస్తున్నట్టు తెలిపారు.
ప్రత్యేకంగా నిర్వహిస్తున్న చెస్ట్ ఓపీలో మంగళవారం జ్వరం, దగ్గు, జలుబుతో బాధపడుతున్న పలువురికి వైద్య పరీక్షలు చేశారు. వీరిలో ఒకరు పూణె నుంచి, మరో ఇద్దరు దుబాయ్ నుంచి వచ్చినట్టు సమాచారం. వీరికి ప్రాథమికంగా ప్రత్యేక వైద్య చికిత్సలు అందజేశారు. వీరి ఆరోగ్యానికి సంబంధించి వివరాలు తెలియాల్సి ఉందని ఆసుపత్రి సూపరింటెండెంట్ సోమసుందరరావు తెలిపారు.