డాక్టర్‌ చంద్రశేఖర్‌కు న్యాయం చేయాలి

ABN , First Publish Date - 2020-12-20T06:02:30+05:30 IST

రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రి వైద్యుడు డాక్టర్‌ చంద్రశేఖర్‌కు అన్యాయంగా మెమో జారీ చేశారని, ఆయనపై కొందరు తప్పుడు ఫిర్యాదు చేశారని, దీనిపై విచారణ చేయించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పలువురు దళిత సంఘాల నాయకులు రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నానిని కలిసి కోరారు.

డాక్టర్‌ చంద్రశేఖర్‌కు న్యాయం చేయాలి

  • వైద్య, ఆరోగ్యశాఖ మంత్రిని కలిసిన దళిత నాయకులు

రాజమహేంద్రవరం అర్బన్‌, డిసెంబరు 19: రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రి వైద్యుడు డాక్టర్‌ చంద్రశేఖర్‌కు అన్యాయంగా మెమో జారీ చేశారని, ఆయనపై కొందరు తప్పుడు ఫిర్యాదు చేశారని, దీనిపై విచారణ చేయించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పలువురు దళిత సంఘాల నాయకులు రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నానిని కలిసి కోరారు. ఈ మేరకు డివిజనల్‌ లెవెల్‌ విజిలెన్స్‌ అండ్‌ మానిటరింగ్‌ కమిటీ సభ్యుడు బి.జార్జి ఆంథోని, నాయకులు ఇసుకపట్ల రాంబాబు, నక్కా వెంకటరత్నరాజు, దారా యేసురత్నం, అర్థాల కుమార్‌బాబు విజయవాడ సచివాలయంలోని ఆయన ఛాంబర్‌లో మంత్రిని కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. చంద్రశేఖర్‌పై ఇచ్చిన ఫిర్యాదు కుట్రతోను, కుల వివక్షతతోను చేశారని మంత్రికి వివరించారు. కొవిడ్‌ ఉధృతంగా ఉన్న సమయంలో ప్రాణాలకు లెక్కచేయకుండా ప్రభుత్వాసుపత్రిలో వేలాదిమంది బాధితులకు వైద్యం చేసి ప్రాణం పోశారని, అలాంటి వైద్యుడిని మెమో ఇచ్చి అవమానించడం తగదని మంత్రి వద్ద పేర్కొన్నామని జార్జి ఆంథోని తెలిపారు.

Updated Date - 2020-12-20T06:02:30+05:30 IST