మూడు రాజధానులు వద్దు

ABN , First Publish Date - 2020-10-12T10:39:19+05:30 IST

టీడీపీ దురదృష్టవశాత్తూ అధికారం కోల్పోయిందని అందుకే అమరావతి ప్రస్తుతం

మూడు రాజధానులు వద్దు

రాజమహేంద్రవరం సిటీ, అక్టోబరు 11: టీడీపీ దురదృష్టవశాత్తూ అధికారం కోల్పోయిందని అందుకే అమరావతి ప్రస్తుతం నీరుగారుతోందని ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీశ్రీనివాస్‌ అన్నారు. రాజమహేంద్రవరం జాంపేట గాంధీ బొమ్మ వద్ద అమరావతి రైతుల ఉద్యమానికి మద్దతుగా ఆదివారం నిరసన ప్రదర్శన చేశారు. రైతుల ఉద్యమం చేపట్టి 300 రోజులు అయిన సందర్భాన్ని గుర్తు చేస్తూ టీడీపీ నగర శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసనలో ఎమ్మెల్యే భవాని, టీడీపీ యువనేత ఆదిరెడ్డి వాసు, శాప్‌ మాజీ డైరెక్టర్‌ యర్రా వేణుగోపాలరాయుడు, ఎస్సీ కార్పొరేషన్‌ మాజీ డైరెక్టర్‌ కాశి నవీన్‌కుమార్‌ పాల్గొన్నారు.


ఈ సందర్భంగా భవాని మాట్లాడుతూ ప్రజల అభీష్టం మేరకే అప్పటి సీఎం చంద్రబాబు అమరావతిని రాజధానిగా ప్రకటించారన్నారు.  టీడీపీ పార్లమెంట్‌ నియోజకవర్గ మహిళ కమిటీ అధ్యక్షురాలు మాలే విజయలక్ష్మి, మాజీ ఫ్లోర్‌ లీడర్‌ వర్రే శ్రీనివాసరావు, యాళ్ల ప్రదీప్‌, మజ్జి రాంబాబు, దాస్యం ప్రసాద్‌, కుడిపూడి సత్తిబాబు, బెజవాడ రాజ్‌కుమార్‌, కడలి రామకృష్ణ, పితాని కుటుంబరావు, మర్రి దుర్గాశ్రీనివాసరావు పాల్గొన్నారు.

Updated Date - 2020-10-12T10:39:19+05:30 IST