రాజాపై తదుపరి చర్యలొద్దు.. ఉత్తర్వులు జారీ చేసిన హైకోర్టు

ABN , First Publish Date - 2020-09-05T17:32:40+05:30 IST

డీసీసీబీ మాజీ చైర్మన్‌ వరుపుల రాజాపై ఎలాంటి పోలీసు చర్యలూ చేపట్టవద్దని రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు తీర్పు కాపీని వెలువరించింది. పూర్తిస్థాయి విచారణ చేపట్టకుండా ఎందుకు చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలని

రాజాపై తదుపరి చర్యలొద్దు.. ఉత్తర్వులు జారీ చేసిన హైకోర్టు

(కాకినాడ, ఆంధ్రజ్యోతి/ప్రత్తిపాడు): డీసీసీబీ మాజీ చైర్మన్‌ వరుపుల రాజాపై ఎలాంటి పోలీసు చర్యలూ చేపట్టవద్దని రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు తీర్పు కాపీని వెలువరించింది. పూర్తిస్థాయి విచారణ చేపట్టకుండా ఎందుకు చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలని ప్రశ్నించింది. ప్రత్తిపాడు వ్యవసాయ ప్రాథమిక పరపతి సంఘంలో నిధుల దుర్వినియోగం వ్యవహారంలో గత శుక్రవారం ప్రత్తిపాడు పోలీసు స్టేషన్‌లో రాజాపై కేసులు నమోదయ్యాయి.


రూ.16.50 కోట్లు దుర్వినియోగమైనట్టు విచారణ కమిటీ  నిర్ధారించిందని పేర్కొంటూ డివిజనల్‌ సహకార అధికారి ప్రత్తిపాడు స్టేషన్‌లో రాజాపై ఫిర్యాదు చేశారు. దీంతో ఆయనపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో తనపై పోలీసులు చర్యలు తీసుకోరాదని, తాను ప్రతిపక్షంలో ఉండడంతో రాజకీయ దురుద్దేశంతోనే ఇలా చేస్తున్నారని రాజా హైకోర్టులో క్వాష్‌ పిటిషన్‌ వేశారు. దీనిని విచారించిన న్యాయస్థానం రాజాపై నమోదు చేసిన కేసుల విషయలో తదుపరి చర్యలు వద్దని ఆదేశించింది. అనంతరం కేసును వాయిదా వేసింది.


Updated Date - 2020-09-05T17:32:40+05:30 IST