జాగ్రత్తలు పాటించి దీపావళి వేడుకలు

ABN , First Publish Date - 2020-11-13T06:14:02+05:30 IST

జాతీయ హరిత ట్రిబ్యునల్‌ సూచించిన మేరకు ప్రజలు జాగ్రత్తలు పాటించి దీపావళి పండుగ ఆనందంగా జరుపుకోవాలని సబ్‌ కలెక్టర్‌ అనుపమ అంజలి కోరారు.

జాగ్రత్తలు పాటించి దీపావళి వేడుకలు

  • వ్యాపారులు శానిటైజర్‌ ఉపయోగించొద్దు
  • సబ్‌ కలెక్టర్‌ అనుపమ అంజలి 

రాజమహేంద్రవరం అర్బన్‌, నవంబరు 12: జాతీయ హరిత ట్రిబ్యునల్‌ సూచించిన మేరకు ప్రజలు జాగ్రత్తలు పాటించి దీపావళి పండుగ ఆనందంగా జరుపుకోవాలని సబ్‌ కలెక్టర్‌ అనుపమ అంజలి కోరారు. ఈ మేరకు గురువారం ఆమె ఓ ప్రకటన విడుదల చేస్తూ రాత్రి 8 గంటల నుంచి 10 గంటల మధ్య మాత్రమే తక్కువ మోతాదులో వాయు కాలుష్యం, తక్కువ శబ్ద కాలుష్యం కల్గిన టపాసులు వాడాలని సూచించారు. బాణాసంచా కాల్చడం కరోనా బాధితులకు ప్రాణసంకటంగా మారుతుందని, అత్యంత ప్రమాదకరమని పేర్కొన్నారు. శ్యాసకోశ వ్యాధులు వచ్చే ప్రమాదముందన్నారు. బాణాసంచా నిల్వ ఉంచిన ప్రదేశాలను గుర్తిస్తే దగ్గరలోని ప్రభుత్వాధికారుల దృష్టికి తీసుకెళ్లాలన్నారు. దుకాణదారులు శానిటైజర్‌ ఉపయోగించరాదని, కొనుగోలుదారులు షాపుల వద్ద భౌతిక దూరం పాటించేవిధంగా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. ఉదయం 6నుంచి సాయంత్రం 6 గంటల వరకూ మాత్రమే విక్రయించాలని సబ్‌కలెక్టర్‌ స్పష్టం చేశారు.

Updated Date - 2020-11-13T06:14:02+05:30 IST