-
-
Home » Andhra Pradesh » East Godavari » divis factory police cases farmers
-
దివిస్ ఉద్యమకారులపై కేసులను ఎత్తివేయాలి
ABN , First Publish Date - 2020-12-19T05:33:27+05:30 IST
పెద్దాపురం, డిసెంబరు 18: దివిస్ ఉద్యమకారులపై మోపిన అక్రమ కేసులను తక్షణమే ఎత్తివేయాలని ఏపీ రైతుకూలీ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బి.రమేష్ డిమాండ్ చేశారు. ఆర్డీవో కార్యాలయం వద్ద ప్రజా సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భం

రైతుకూలీ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్
పెద్దాపురం, డిసెంబరు 18: దివిస్ ఉద్యమకారులపై మోపిన అక్రమ కేసులను తక్షణమే ఎత్తివేయాలని ఏపీ రైతుకూలీ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బి.రమేష్ డిమాండ్ చేశారు. ఆర్డీవో కార్యాలయం వద్ద ప్రజా సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ గత ప్రభుత్వ హయా ంలో దివిస్‌కు వ్యతిరేకంగా తమతో కలిసి పోరాటం చేసిన వైసీపీ ఇప్పుడు అధికారంలోకి రాగానే దివీస్ యాజమాన్యానికి అమ్ముడుపోయి మళ్లీ అనుమతులను పునరుద్ధరించడం సిగ్గుచేటని విమర్శించారు. శాంతియుతంగా పోరాటం చేస్తున్న వామపక్ష పార్టీలు, ప్రజలపై పోలీసులు దురుసుగా వ్యవహరించడం అన్యాయమన్నారు. బయటి ప్రాంతం నుంచి కొంతమంది వ్యక్తులు ప్రవేశించి ఉద్యమాన్ని పక్కదారి పట్టించే కుట్రలో భాగంగా దివిస్ కంపెనీ కంటైనర్‌ను దగ్ధం చేశారని ఆరోపించారు. తక్షణమే వామపక్ష నాయకులను, బాధిత ప్రజలను బేషరుతుగా విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఆర్డీవో మల్లిబాబుకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో కొండా దుర్గారావు, పీడీఎ్‌సయూ విజృంభణ జిల్లా కార్యదర్శి కడితి సతీష్, సీపీఎం నాయకులు నీలపాల సూరిబాబు, దారపురెడ్డి క్రాంతికుమార్ పాల్గొన్నారు.