ఏపీ లాసెట్‌లో జిల్లాకు టాప్‌ ర్యాంకులు

ABN , First Publish Date - 2020-11-06T06:08:23+05:30 IST

శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం నిర్వహించిన ఏపీ లాసెట్‌ ఫలితాలు గురువారం విడుదలయ్యాయి.

ఏపీ లాసెట్‌లో జిల్లాకు టాప్‌ ర్యాంకులు

కాకినాడ రూరల్‌, నవంబరు 5: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం నిర్వహించిన ఏపీ లాసెట్‌ ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో జిల్లాలోని రాజమహేంద్రవరం ప్రకా్‌షనగర్‌కు చెందిన జె.అప్పానంద్‌ మూడేళ్ల ఎల్‌ఎల్‌బీ ప్రవేశపరీక్షలో రాష్ట్ర స్థాయిలో 3వ ర్యాంకు సాధించాడు. అదేవిధంగా పీజీఎల్‌సెట్‌లో ప్రత్తిపాడు మండలం ధర్మవరానికి చెందిన డి.రవిచంద్ర రాష్ట్రస్థాయిలో మొదటి ర్యాంకును పొందారు. 5 ఏళ్ల బీఎల్‌, ఎల్‌ఎల్‌బీ కోర్సు ప్రవేశ పరీక్షలో గొల్లలమామిడాడకు చెందిన డి.రాజాశ్రీరెడ్డి 4వ ర్యాంకును, తొండంగికి చెందిన డీఎ్‌సఎస్‌ లోవమౌనికపావని 7వర ్యాంకును, ఇంద్రపాలెంకు చెందిన పలివెల సూర్య రాష్ట్రస్థాయిలో 8వ ర్యాంకును సాధించారు. 

  • న్యాయవాద వృత్తే ధ్యేయం : లాసెట్‌ ప్రథమ ర్యాంకర్‌ 

ప్రత్తిపాడు, నవంబరు 5: న్యాయవాద వృత్తి చేపట్టడమే తన జీవిత ధ్యేయమని పీజీ లాసెట్‌ రాష్ట్ర ప్రథమ ర్యాంక్‌ సాధించిన విద్యార్థి దాడి రవిచంద్ర తెలిపారు. రాష్ట్రస్థాయిలో ప్రథమర్యాంకు సాధించడం సంతోషం కలిగించిందన్నారు. అడ్వకేట్‌గా ప్రాక్టీస్‌ చేసి రాణించాలని భావిస్తున్నట్టు తెలిపారు. ధర్మవరంలో దాడి రామకృష్ట సూర్యకుమారి దంపతులకు మౌనిక, రవిచంద్ర సంతానం. మౌనిక డాక్టర్‌గా ప్రత్తిపాడు ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలు అందిస్తున్నారు. రవిచంద్రను పలువురు అభినందించారు.

  • సేవ చేయడమే లక్ష్యం : అప్పానంద్‌, 3వ ర్యాంకు

రాజమహేంద్రవరం సిటీ, నవం బరు5: ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా తాను చదువుకున్నానని లాసెట్‌లో రాష్ట్ర స్ధాయిలో 3 ర్యాంక్‌ సాధించిన జె అప్పానంద్‌ తెలిపా రు. తన లక్ష్యం సివిల్స్‌లో రాణించాలని, అలాగే గ్రూప్‌ 1 కూడా ప్రిపేర్‌ అవుతున్నానన్నారు. తాను ప్రభుత్వ ఉద్యోగం సాధించి ప్రజలకు  సేవలు అందించాలని ఆకాంక్షతో ముందుకు వెళుతున్నానని చెప్పారు. ర్యాంక్‌ సాధించడం ఆనందంగా ఉందన్నారు.

  • జడ్జిని అవుతా : రాజశ్రీరెడ్డి

పెదపూడి, నవంబరు 5: పెద పూడి మండలం జి.మామిడాడకు చెందిన ద్వారంపూడి రాజశ్రీరెడ్డి (హా ల్‌ టికెట్‌ నెంబరు 4233010383) లాసెట్‌లో రాష్ట్రస్థాయిలో 4వ ర్యాంక్‌ సాధించింది. కాకినాడ ఆదిత్య కళా   శాలలో ఎంఈసీ గ్రూప్‌లో విద్యనభ్య సించిన రాజశ్రీరెడ్డి  ఇటీవల శ్రీకృష్ణ దేవరాయ యూనివర్శిటీ నిర్వహిం చిన లాసెట్‌ ఐదు సంవత్సరాల కోర్సు ఎంట్రన్స పరీక్షలలో రాష్ట్ర స్థాయిలో 4వ ర్యాంక్‌ సాధించింది. విశాఖపట్టణం దామోదరం సంజీ వయ్య వర్సిటీ ఆఫ్‌ లా కళా శాలలో లాకోర్సు పూర్తిచేస్తానని, జడ్జిగా ఉన్నత శిఖరాలను అధిరోహించడమే తన లక్ష్యమని రాజశ్రీ తెలిపింది. 

Updated Date - 2020-11-06T06:08:23+05:30 IST