జిల్లాస్థాయి సాఫ్ట్‌ టెన్నిస్‌ బాల్‌ పోటీలు ప్రారంభం

ABN , First Publish Date - 2020-12-28T06:02:35+05:30 IST

జిల్లా సాఫ్ట్‌ టెన్నిస్‌ బాల్‌ క్రీడా సంఘం ఆధ్వర్యం లో జిల్లాస్థాయి పోటీలు ఆది వారం ఘనంగా ప్రారంభమయ్యాయి.

జిల్లాస్థాయి సాఫ్ట్‌ టెన్నిస్‌ బాల్‌ పోటీలు ప్రారంభం

కాకినాడ స్పోర్ట్స్‌, డిసెంబరు 27: జిల్లా సాఫ్ట్‌ టెన్నిస్‌ బాల్‌ క్రీడా సంఘం ఆధ్వర్యం లో జిల్లాస్థాయి పోటీలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. కాకినాడ రంగరాయ వైద్య కళాశాల ప్రాంగణంలో డీఎస్‌ఏ చీఫ్‌ కోచ సురేష్‌ కుమార్‌ పోటీలను ప్రారంభిం చారు. సంఘం అధ్యక్షుడు కలవల కృష్ణమూర్తి (గాంధీ) మాట్లాడుతూ జిల్లాలో సాఫ్ట్‌ టెన్నిస్‌ బాల్‌ క్రీడను కొత్తగా ప్రారం భించామన్నారు. డీఎస్‌ఏ చీఫ్‌ కోచ సురేష్‌కుమార్‌ మాట్లాడుతూ క్రీడల్లో రాణిస్తే ఉద్యోగావకాశాలు వస్తాయన్నారు. గౌరవ అతిధి ఆర్‌ఎంసీ పీడీ డాక్టర్‌ కె.స్పర్జనరాజు మాట్లాడుతూ ఫిబ్రవరిలో రాష్ట్ర స్థాయి పోటీలు కాకినాడలో నిర్వ హించడానికి సంఘం ముందుకు రావడం సంతోషం గా ఉందన్నారు. సబ్‌ జూనియర్స్‌, జూనియర్స్‌ విభాగంలో నిర్వహించే ఈ పోటీలకు 55 మంది క్రీడాకారులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పోటీల నిర్వహణా కార్యదర్శి గోవిందరాజు, సం ఘం కార్యదర్శి సౌధామణి, ఏపీ లాన టెన్నిస్‌ సంఘం కార్యదర్శి పి.వి.రామ్‌కుమార్‌; అథ్లెటిక్స్‌ సంఘం కార్య దర్శి టీవీఎస్‌ రంగారావు, రవికౌర్‌, సంఘ కోశాధికారి గోపి, రవి శంకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-28T06:02:35+05:30 IST