పౌష్టికాహార కిట్లు పంపిణీ

ABN , First Publish Date - 2020-10-07T09:04:32+05:30 IST

మండలంలోని గ్రామాల్లో మంగళవారం స్థానిక ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు సమకూర్చిన పౌష్టికాహార కిట్లను 61మంది కొవిడ్‌ బాధితులకు అందజేశారు...

పౌష్టికాహార కిట్లు పంపిణీ

కపిలేశ్వరపురం, అక్టోబరు 6: మండలంలోని గ్రామాల్లో మంగళవారం స్థానిక ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు సమకూర్చిన పౌష్టికాహార కిట్లను 61మంది కొవిడ్‌ బాధితులకు అందజేశారు. ఈసందర్భంగా టీడీపీ మండల అధికార ప్రతినిధి పుత్సల శ్రీనివాస్‌ మాట్లాడుతూ ఆగస్టు 18 నుంచి ఇప్పటివరకూ 610మంది కొవిడ్‌ బాధిత కుటుంబాలకు ఆయా గ్రామాల టీడీపీ నాయకులు, కార్యకర్తలు కిట్లు అందజేసినట్లు తెలిపారు. కార్యక్రమాల్లో ఆయా గ్రామాల పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 

Read more