-
-
Home » Andhra Pradesh » East Godavari » display board
-
డిస్‌ప్లే బోర్డులను తెలుగులో ఉంచండి: జేసీ
ABN , First Publish Date - 2020-11-25T05:48:55+05:30 IST
సచివాలయాలకు వచ్చే ప్రజలు అవగాహన కలిగి చదువుకుని సహాయం పొందేలా డిస్‌ప్లే బోర్డులన్నీ తెలుగులో ఉండేలా చూడాలని జాయింట్ కలెక్టర్ లక్ష్మీశ సచివాయ సిబ్బందికి సూచించారు.

రంగంపేట, నవంబరు 24: సచివాలయాలకు వచ్చే ప్రజలు అవగాహన కలిగి చదువుకుని సహాయం పొందేలా డిస్‌ప్లే బోర్డులన్నీ తెలుగులో ఉండేలా చూడాలని జాయింట్ కలెక్టర్ లక్ష్మీశ సచివాయ సిబ్బందికి సూచించారు. మంగళవారం సాయంత్రం ఆయన రంగంపేట-1 సచివాలయాన్ని తహశీల్దార్ వై.జయతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా సచివాలయంలో సిబ్బందిని రైస్ కార్డుల ప్రింటింగ్ గురించి ప్రశ్నించారు. అనంతరం నోటీస్‌బోర్డులను, డిస్‌ప్లే బోర్డులను పరిశీలించారు. 80శాతం బోర్డులు తెలుగులో ఉన్నా మిగలిన వికూడా మార్చాలని సిబ్బందికి సూచించారు.