-
-
Home » Andhra Pradesh » East Godavari » Dhavaleshwar in Corona
-
ధవళేశ్వరంలో..కరోనా కలకలం
ABN , First Publish Date - 2020-03-24T07:08:37+05:30 IST
ధవళేశ్వరానికి చెందిన ఒక యువకుడు విదేశాలకు వెళ్లి వచ్చి కరోనా లక్షణాలతో అస్వస్థతకు గురయ్యాడనే

ధవళేశ్వరం, మార్చి 23: ధవళేశ్వరానికి చెందిన ఒక యువకుడు విదేశాలకు వెళ్లి వచ్చి కరోనా లక్షణాలతో అస్వస్థతకు గురయ్యాడనే సమాచారం కలకలం రేపంది. వివరాలు ఇలా ఉన్నాయి... రాజమహేంద్రవరానికి చెందిన వ్యక్తి వ్యాపార పనులపై తరచూ సింగపూర్ వెళ్లి వస్తుండేవాడు.
ధవళేశ్వరం ఎర్రకొండకు చెందిన వ్యక్తి అతడి కారు డ్రైవరుగా ఉన్నాడు. కొద్ది రోజులుగా డ్రైవరు అనారోగ్యానికి గురవ్వడంతో ఆతడి కుటుంబ సభ్యులు కరోనా అనుమానంతో వైద్యులకు సమాచారం అందించారు. దీంతో సోమవారం ప్రత్యేక వైద్య బృందం ఎర్రకొండకు చేరుకుని ఆటో డ్రైవరును పరీక్షించింది.
అతడికి సాధారణ జ్వరం ఉందని, 14 రోజులు పాటు ఇంట్లోనే ఉండాలని సూచించింది. కాగా సదరు వ్యాపారవేత్త రెండు నెలలుగా విదేశాలకు వెళ్లలేదని, ఆయనకు ఎటువంటి అనారోగ్యం లేదని విచారణలో తేలిందని సీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్ సుధాకర్ చెప్పారు.