నిందితులను శిక్షించాలని ధర్నా

ABN , First Publish Date - 2020-10-03T07:20:32+05:30 IST

యూపీలో హత్రాస్‌లో దళిత యువతిపై హత్యాచారం చేసిన దుండగుల్ని కఠినంగా శిక్షించాలని కోరుతూ శుక్రవారం ద్రాక్షారామలో యానాం

నిందితులను శిక్షించాలని ధర్నా

ద్రాక్షారామ, అక్టోబరు 2: యూపీలో హత్రాస్‌లో దళిత యువతిపై హత్యాచారం చేసిన దుండగుల్ని కఠినంగా శిక్షించాలని కోరుతూ శుక్రవారం ద్రాక్షారామలో యానాం సెంటర్‌లో ప్రజా సంఘాలు ధర్నా నిర్వహించాయి. బీఆర్‌ అంబేద్కర్‌ విగ్రహం వద్ద ఏఐకెఎంఎస్‌, పీవైఎల్‌, పీవోడబ్యు, ఐఎఫ్‌టీయు, పీడీఎస్‌యు, జైబీమ్‌ దళిత సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. ఏఐకెఎంఎస్‌ జిల్లా అధ్యక్షుడు జనిపెల్ల సత్తిబాబు, డివిజన్‌ కార్యదర్శి వెంటపల్లి భీమశంకరం, పీడీఎస్‌యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యు.గనిరాజు పాల్గొన్నారు.

Updated Date - 2020-10-03T07:20:32+05:30 IST