ఏలేశ్వరంలో కార్మిక సంఘాల ధర్నా

ABN , First Publish Date - 2020-05-09T07:53:10+05:30 IST

విశాఖ సమీపంలోని ఆర్‌ఆర్‌ వెంకటాపురం ఎల్జీ పాలిమర్స్‌లో విష వాయువు లీకేజీ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి

ఏలేశ్వరంలో కార్మిక సంఘాల ధర్నా

ఎల్జీ పాలిమర్స్‌ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి


ఏలేశ్వరం, మే 8: విశాఖ సమీపంలోని ఆర్‌ఆర్‌ వెంకటాపురం ఎల్జీ పాలిమర్స్‌లో విష వాయువు లీకేజీ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి యాజమాన్యంపై క్రిమినల్‌ కేసు నమోదు చేసి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని సీపీఐ (ఎంఎల్‌) లిబరేషన్‌ జిల్లా కార్యదర్శి కొసిరెడ్డి గణేశ్వరరావు డిమాండ్‌ చేశారు. శుక్రవారం ఆయన నేతృత్వంలో ఐప్వా మహిళ, ఏఐసీసీటీయూ, కార్మిక సంఘాల నాయకులు, కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. పరిశ్ర మను దూరంగా తరలించాలని, చనిపోయిన వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండు చేశారు. ఆందోళనలో మసకపల్లి ధనబాబు, గుమ్మడి పాదాలమ్మ, కందుల వరలక్ష్మి, ప్రసాద్‌, సురేష్‌ తదితర నాయకులు పాల్గొన్నారు.


ప్రత్తిపాడు: ఎల్జీ పాలిమార్స్‌ యాజమాన్యాన్ని అరెస్టు చేయాలని డిమాండ్‌ చేస్తూ మండలంలోని ప్రత్తిపాడు, లంపకలోవ, యూజే పురం, పోతులూరు, చింతలూరు, ధర్మవరం  గ్రామాల్లో సీపీఐ (ఎంఎల్‌) లిబరేషన్‌ కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. లిబరేషన్‌ రాష్ట్ర కార్యదర్శి బుగతా బంగార్రాజు మాట్లాడుతూ ఈ ఘటన భోపాల్‌ గ్యాస్‌ లీకేజీ ఘటనను గుర్తుకు తెచ్చిందన్నారు. 2019లో ప్లాంటు విస్తరణకు అనుమతులు ఇచ్చిన అధికారులతో పాటు లాక్‌డౌన్‌ సమయంలో ప్లాంటు పనులు చేసేందుకు అనుమతి ఇచ్చిన పర్యావరణ శాఖ అధికారులపై కూడా కేసులు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. ఆందోళనల్లో మానుకొండ లచ్చబాబు, మన్నేపల్లి వెంకటరమణ, రాపా లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-05-09T07:53:10+05:30 IST