నియోజకవర్గంలో అభివృద్ధి పూర్తిగా కుంటుపడింది

ABN , First Publish Date - 2020-10-01T07:16:11+05:30 IST

నియోజకవర్గంలో అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉందని ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప

నియోజకవర్గంలో అభివృద్ధి పూర్తిగా కుంటుపడింది

ఎమ్మెల్యే చినరాజప్ప


పెద్దాపురం, సెప్టెంబరు 30: నియోజకవర్గంలో అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉందని ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. పట్టణంలో టీడీపీ ప్రభుత్వ హ యాంలో చేపట్టిన అభివృద్ధి పనులు నిర్మాణ దశలో నిలిచిపోయాయన్నారు. బుధవారం ఆయన ఆర్డీవో, తహశీల్దార్‌లతో కలిసి ఆయా ప్రాంతాలను పరిశీలించారు.


అనంతరం రాజప్ప మాట్లాడుతూ తుది దశకు వచ్చిన భవనాల నిర్మాణాలను గాలికి వదిలేసిన వైసీపీ ప్రభుత్వ తీరును విమర్శించారు. పట్టణంలో ముఖ్యమైన ప్రభుత్వ కార్యాలయాలకు లక్షలాది రూపాయలు అద్దె చెల్లిస్తూ కొనసాగించడం చూస్తుంటే ప్రభుత్వ తీరు అర్థమవుతోందన్నారు. కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకుండా తాత్సారం చేయడం అభివృద్ధిని ఉద్దేశపూర్వకంగా అడ్డుకోవడమేనన్నారు.


ఈ విషయంలో అధికారుల తీరుపట్ల ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఆర్‌అండ్‌బీ ఈఈ అంబటి సూర్యప్రకాశరావు, తహశీల్దార్‌ బూసి శ్రీదేవి, గుడా మాజీ డైరెక్టర్‌ ఎలిశెట్టి నాని పాల్గొన్నారు.

Updated Date - 2020-10-01T07:16:11+05:30 IST