డీఈవో కార్యాలయం ముట్టడి

ABN , First Publish Date - 2020-12-11T06:33:45+05:30 IST

ఉపా ధ్యాయ బదిలీల్లో న్యాయమైన సమస్యలు పరిష్కరించకపోవడాన్ని నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్‌ ఉపాధ్యా య సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయాన్ని గురువారం ముట్టడించింది.

డీఈవో కార్యాలయం ముట్టడి
డీఈవో కార్యాలయాన్ని ముట్టడించిన ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు

కాకినాడ (ఆంధ్రజ్యోతి), డిసెంబరు 10: ఉపాధ్యాయ బదిలీల్లో న్యాయమైన సమస్యలు పరిష్కరించకపోవడాన్ని నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్‌ ఉపాధ్యా య సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయాన్ని గురువారం ముట్టడించింది. కౌన్సెలింగ్‌ విధానానికి తూట్లు పొడుస్తున్న అధికారుల వ్యవహారాన్ని, ప్రభుత్వ వైఖరిని ఎండ గడుతూ ఉపాధ్యాయులు నినాదాలు చేశారు. వెబ్‌ కౌన్సెలింగ్‌ను రద్దు చేసిన మాన్యువల్‌ కౌన్సెలింగ్‌నే జరపాలని డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా ఎస్టీయూ ఏపీ కోశాధికారి సుబ్బరాజు ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడుతూ ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయాలు తీసుకుందని, తమ సమస్యల పరిష్కారానికి గత ప్రభుత్వం చాకచక్యంగా వ్యవహరించి డిమాండ్ల ను నెరవేర్చేదని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు.

Updated Date - 2020-12-11T06:33:45+05:30 IST