రూ.1000 కోట్లతో డెల్టా ఆధునికీకరణ

ABN , First Publish Date - 2020-08-01T11:11:08+05:30 IST

వచ్చే వేసవి సీజన్‌లో డెల్టా ఆధునికీకరణ, కాలువలు, డ్రైన్లలో ఓఅండ్‌ఎం పనుల నిమి త్తం పక్కా ప్రకాళిక ..

రూ.1000 కోట్లతో డెల్టా ఆధునికీకరణ

ఇరిగేషన్‌ అధికారుల ప్రతిపాదన

వచ్చే సీజన్‌కు ప్రణాళిక సిద్ధం

యంత్రాలతో ఓఅండ్‌ఎం పనులు

సమీక్షలో మంత్రులు అనిల్‌కుమార్‌  యాదవ్‌, కురసాల కన్నబాబు


రాజమహేంద్రవరం, జూలై 31 (ఆంధ్రజ్యోతి): వచ్చే వేసవి సీజన్‌లో డెల్టా ఆధునికీకరణ, కాలువలు, డ్రైన్లలో ఓఅండ్‌ఎం పనుల నిమి త్తం పక్కా ప్రకాళిక సిద్ధం చేయాలని జలవనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌,  వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు ఇరిగేషన్‌ అధికార్లను ఆదేశించారు. విజయవాడలో శుక్రవారం ధవళేశ్వరం ఇరిగేషన్‌ సర్కిల్‌ పరిధిలోని సీఈ శ్రీధర్‌, ఎస్‌ఈ కెఎస్‌ ప్రకాశరావు తదితరులతో మంత్రులు సమీక్షించారు.


గోదావరి జిల్లాల్లో డెల్టా మోడరైజేషన్‌, ఓఅండ్‌ఎం పనులకు రూ.1000 కోట్లు అవుతాయని అధికారులు తెలిపారు. దీనిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని మంత్రు లు ఆదేశించారు. ముఖ్యమైన పనులకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. సామర్లకోట కాలువ బలోపేతం, బిక్కవోలు డ్రైను అభివృద్ధి పనులు తప్పనిసరిగా చేయాలని మంత్రి కన్నబాబు సూచించారు. వచ్చే సీజన్‌లో కాలువలు, డ్రైన్లలో పూడికలు తీయడానికి యంత్రాలు ఉపయోగించేటట్టు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. 

Updated Date - 2020-08-01T11:11:08+05:30 IST