ఏడు నెలలు నిండకముందే ప్రసవం.. 800 గ్రాముల బిడ్డ క్షేమం
ABN , First Publish Date - 2020-06-25T20:01:09+05:30 IST
చింతూరు మండలం దేవరపల్లిలో ఓ తల్లి కేవలం 800 గ్రాముల బరువున్న బిడ్డకు జన్మనిచ్చింది. ఏడు నెలలు నిండక ముందు

చింతూరు (తూర్పు గోదావరి జిల్లా) : చింతూరు మండలం దేవరపల్లిలో ఓ తల్లి కేవలం 800 గ్రాముల బరువున్న బిడ్డకు జన్మనిచ్చింది. ఏడు నెలలు నిండక ముందు పురిటి నొప్పులతో బాధపడుతున్న జల్లి భద్రమ్మను ఆమె కుటుంబ సభ్యులు ఆటోలో చింతూరు ఏరియా ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారు. భద్రమ్మ మార్గమధ్యంలోనే బిడ్డకు జన్మనిచ్చింది. అదే ఆటోలో తల్లి, బిడ్డను చింతూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. అప్పటి నుంచి చిన్న పిల్లల ప్రత్యేక వైద్య నిపుణురాలు డా. ఝాన్సీరాణి పర్యవేక్షణలో తల్లీబిడ్డకు మొత్తం 41 రోజులపాటు వైద్య సదుపాయాలు అందించారు. బుధవారం ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కోటిరెడ్డి తల్లీబిడ్డల ఆరోగ్య స్థితిగతులను పరిశీలించారు. 41 రోజులలో ఆ బిడ్డ 400 గ్రాములు బరువు పెరగడంతో పాటు, ఆరోగ్యం మెరుగుపడడంతో బుధవారం ఇంటికి తరలించినట్టు డాక్టర్ కోటిరెడ్డి తెలిపారు.