డీసీఎం వ్యాన్‌ భీభత్సం

ABN , First Publish Date - 2020-12-27T06:53:27+05:30 IST

ఒకే డీసీఎం వాహనం... వ్యాను వెంటనే రెండు ప్రమాదాలకు కారణమైంది... ఈ సంఘటన శనివారం గుండాల సమీపంలో జా తీయ రహదారిపై చోటు చేసుకుంది..

డీసీఎం వ్యాన్‌ భీభత్సం

జామాయిల్‌ ట్రాక్టర్‌, కారు ధ్వంసం

ఎటపాక, డిసెంబరు 26 : ఒకే డీసీఎం వాహనం... వ్యాను వెంటనే రెండు ప్రమాదాలకు కారణమైంది... ఈ సంఘటన శనివారం గుండాల సమీపంలో జా తీయ రహదారిపై చోటు చేసుకుంది.. భద్రాచలం నుం చి నెల్లిపాకవైపు వస్తున్న డీసీఎం వ్యాన్‌ తొలుత గుం డాల సమీపంవద్ద జాతీయ రహదారిపై నిలుపుదల చేసి ఉన్న జామాయిల్‌ లోడు ట్రాక్టర్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో ఓ వలస ఆదివాసీకి గాయాలయ్యాయి. ఇదే డీసీఎం వాహనం కొద్దిదూరం వెళ్లాక ఎదురుగా వస్తున్న ఓ కారుని ఢీకొట్టింది. కారులోని పలువురికి గాయాలయ్యాయి.  కారు ముందుభాగం దెబ్బతింది. డీసీఎం వ్యాన్‌ డ్రైవర్‌ అతివేగంగా నడపడంవల్లనే ఈప్రమాదాలు జరిగినట్లు తెలుస్తోంది..  


Updated Date - 2020-12-27T06:53:27+05:30 IST