ఘనంగా దత్త జయంతి

ABN , First Publish Date - 2020-12-30T05:21:55+05:30 IST

శ్రీపాద శ్రీవల్లభుడి జన్మస్థానంగా దేశవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన పట్టణంలోని శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానంలో దత్త జయంతి మంగళవారం ఘనంగా జరిగింది.

ఘనంగా దత్త జయంతి
దత్తాత్రేయుడు, శ్రీపాదశ్రీవల్లభుడు, నృసింహ సరస్వతులకు పూలంగి సేవ

పిఠాపురం, డిసెంబరు 29: శ్రీపాద శ్రీవల్లభుడి జన్మస్థానంగా దేశవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన పట్టణంలోని శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానంలో దత్త జయంతి మంగళవారం ఘనంగా జరిగింది. దేశం నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. శ్రీపాదశ్రీవల్లభులకు మహన్యాసపూర్వక శతరుద్రాభిషేకం, శ్రీసూక్త, పురుష సూక్తాలతో సహస్ర నామార్చన, మూలమంత్ర అనుష్టానము, దత్తమంత్రహోమం, పల్లకి సేవ జరిగాయి. దత్తాత్రేయుడు, శ్రీపాదశ్రీవల్లభుడు, నృసింహ సరస్వతులకు పూలంగి సేవ, మారేడుపత్రి పూజ నిర్వహించారు. అనంతరం మహాపూర్ణాహతి జరిగింది. ఆలయ ప్రాంగణాన్ని పుష్పాలతో సుందరంగా తీర్చిదిద్దారు. దత్త జయంతి సప్తాహ మహోత్సవాలు మంగళవారం రాత్రి ముగిశాయి. కార్యక్రమాల్లో ఆలయ ఈవో సౌజన్య తదితరులు పాల్గొన్నారు.

పాదగయ క్షేత్రంలో స్వయంభువమూర్తిగా వెలసిన దత్తాత్రేయస్వామి సన్నిధిలో బుధవారం దత్త జయంతి జరగనున్నది. సర్వపుష్ప లక్షార్చన, ఊయల సేవ నిర్వహణకు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. తిథుల్లో ఉన్న తగులు, మిగులుతో దత్త జయంతి వేర్వేరు తేదీల్లో వచ్చినట్టు అర్చకులు తెలిపారు.


Updated Date - 2020-12-30T05:21:55+05:30 IST