ఘనంగా ముగిసిన సీవైఎఫ్‌ వార్షికోత్సవాలు

ABN , First Publish Date - 2020-10-03T07:41:08+05:30 IST

ఏసుక్రీస్తు బోధనలు ప్రపంచానికి అనుసరణీయమని, యువత చెడు వ్యసనాలకు లోనవ్వకుండా సన్మార్గంలో

ఘనంగా ముగిసిన సీవైఎఫ్‌ వార్షికోత్సవాలు

సర్పవరం జంక్షన్‌, అక్టోబరు 2: ఏసుక్రీస్తు బోధనలు ప్రపంచానికి అనుసరణీయమని, యువత చెడు వ్యసనాలకు లోనవ్వకుండా సన్మార్గంలో పయనించేలా కృషి చేస్తున్న సీవైఎఫ్‌ సంస్థ నిర్వాహకుడు మూర్తిరాజు సేవలు అభినందనీయమని మంత్రి కురసాల కన్నబాబు పేర్కొన్నారు. కాకినాడ రూరల్‌ మండలం తిమ్మాపురంలోని ఓ ఫంక్షన్‌ హాల్లో శుక్రవారం జరిగిన సీవైఎఫ్‌ 23వ వార్షికోత్సవాల ముగింపు వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.


‘లాక్‌డౌన్‌- 2020 నిర్బంధం-విడుదల, విజయం’పై మూర్తిరాజు ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. తొలుత కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి ప్లాస్మా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. హైదరాబాదుకు చెందిన ప్రముఖ మ్యూజిక్‌ డైరెక్టర్‌ జోనా మోహన్‌, ప్రొపెసర్‌ గంటల ప్రకాశ్‌ ‘వాయిద్యాలు, మీలో ఎవరు జ్ఞానవంతులు’ కార్యక్రమం నిర్వహించారు. సీబీసీఎస్‌సీ చైర్మన్‌ ఎం.రత్నకుమార్‌, రెడ్‌క్రాస్‌ చైర్మన్‌ వైడీ రామారావు, మాదారపు ట్రస్టు చైర్మన్‌ మాదారపు తాతాజీ, మోజెస్‌ కిరణ్‌, విలియం బ్రైన్‌హాం, దూదిపాల్‌ శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-10-03T07:41:08+05:30 IST