శివాలయంలో శిలువ బొమ్మలు

ABN , First Publish Date - 2020-07-14T11:26:33+05:30 IST

సిరిపురం శివాలయంలోకి ఆదివారం రాత్రి దుండగులు చొరబడి పలుచోట్ల శిలువ బొమ్మలు, క్రీస్తు రక్ష అంటూ రాసి కలకలం సృష్టించారు.

శివాలయంలో శిలువ బొమ్మలు

కరప, జూలై 13: సిరిపురం శివాలయంలోకి ఆదివారం రాత్రి దుండగులు చొరబడి పలుచోట్ల శిలువ బొమ్మలు, క్రీస్తు రక్ష అంటూ రాసి కలకలం సృష్టించారు. సోమవారం తెల్లవారుజామున ఆలయ అర్చకుడు చాగంటిపాటి అబ్బు ఆలయ గోడలపై ఉన్న వాటిని చూసి గ్రామపెద్దలకు చెప్పి, అధికారులకు ఫిర్యాదు చేశారు. అన్యమతస్థులు ఆలయంలోకి ప్రవేశించడమే కాకుండా హిందూ మనోభావాలను కించపరిచేలా శివుడి బొమ్మలపై శిలువబొమ్మలు వేయడంపై గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు ఎనిమిరెడ్డి మాలకొండయ్య, మండలాధ్యక్షుడు రెడ్డి రమణేశ్వర్‌, పుట్టా వీరప్రసాద్‌గాంధీ, హిందూ చైతన్య సదస్సుల ప్రతినిధి పడాల రఘు, రాష్ట్రీయ బ్రాహ్మణ ఫ్రంట్‌ కార్యదర్శి డి.సాంబశివరావు ఆలయానికి విచ్చేసి శిలువబొమ్మలను పరిశీలించారు. బాధ్యులను గుర్తించి కఠినచర్యలు తీసుకోవాలని కరప పోలీసులు, దేవదాయ శాఖాధికారులకు ఫిర్యాదు చేశారు. అనంతరం అర్చకులు, గ్రామస్థులు ఆలయాన్ని సంప్రోక్షణచేసి పూజలను ప్రారంభించారు. 


Updated Date - 2020-07-14T11:26:33+05:30 IST